Pawan Kalyan reacts on Vizag Steel privatization issue ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ప్రధానిని కలుస్తాం: పవన్ కల్యాణ్

Will meet pm modi on vizag steel privatization issue pawan kalyan

Pawan Kalyan, PM Narendra Modi, Manmohan Singh, disinvestments, visakhapatnam steel plant, Rashtriya Ispat Nigam Ltd (RINL), visakhapatnam steel plant, #Save Steel Plant, agitation, Employees, Trade Unions, disinvestment, Steel Plant Movement, vizag, Vishakapatnam, Andhra Pradesh

Jana Sena chief Pawan Kalyan has announced that he will meet Prime Minister Narendra Modi shortly on the Visakhapatnam steel industry's privatization. Pawan Kalyan has recalled that the former Prime Minister Manmohan Singh had continued to withdraw investments in public sector undertakings.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ప్రధానిని కలుస్తాం: పవన్ కల్యాణ్

Posted: 02/05/2021 08:46 PM IST
Will meet pm modi on vizag steel privatization issue pawan kalyan

ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణను కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లోనూ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు ప్రకటన చేశారు. దీంతో ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ పరిశ్రమ నుంచి నూరుశాతం ఉపసంహరణలు కానున్నాయి. దీని ఆద్వర్యంలో నడిచే విశాఖ ఉక్కు కర్మాగారంలో కూడా ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలపై విశాఖలో కార్మిక సంఘాల అందోళనలను ప్రారంభమయ్యాయి,

గత మూడు రోజులుగా కార్మిక సంఘాల నేతృత్వంలో కార్మికులు అందోళనల్లో పాల్గోంటున్నారు. ఇవాళ ఉదయం ఈ అందోళనలలో భాగంగా విశాఖలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల నిరసన పెగ క్రమంగా రాష్ట్రంలోని వాతావరణం కూడా వేడెక్కుతోంది. యాజమాన్య హక్కులను పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడడం పట్ల రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవసరమైతే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కానీ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట పరం కాకుండా చూస్తానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు.

ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పనవ్ కల్యాణ్ స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇక్కడి ప్రజలకు ఎనలేని అనుబంధం వుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయవద్దని తాను ప్రధాని నరేంద్రమోడీని కలిసి విన్నవిస్తానని అన్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. 22 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం 17 వేల మంది పర్మినెంటు ఉద్యోగులకు, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు, లక్షమంది వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోందని తెలిపారు.

ఇంతటి గొప్ప ప్లాంటు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం జనసేన అభీష్టానికి వ్యతిరేకం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కర్మాగారం విశాఖలో ఏర్పాటు చేయడానికి.. ఒక చరిత్ర వుందన్న ఆయన ఇక్కడి కర్మాగార పునాదులు.. 32 మంది అమరుల ప్రాణత్యాగాలపై నిర్మాణమయ్యాయని గుర్తచేశారు. ఈ కర్మాగారం కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని వివరించారు. ఉద్యమాల ద్వారా సాకారమైన ఉక్కు కర్మాగారం.. ఇక్కడి ప్రజల పాలిట కల్పతరువుగా మారి అనేక మందికి మూడు పూటలా బోజనం లభించేలా చేస్తోందని అన్నారు.

ఇక తాజాగా కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంతో ఈ సంస్థ చేతులు మారుతోందంటే.. ఇది తెలుగువారికి ఆమోదయోగ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసలు, పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్ సింగేనని ఆరోపించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ కర్మాగారం కూడా పెట్టుబడుల ఉపసంహరణ పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని, కర్మాగారాన్ని కాపాడుకుంటామని ఉద్ఘాటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles