Man killed in fight over omelette in Uppal అరవై రూపాయల అమ్లెట్ కోసం.. అసువులు తీసారు..

Hyderabad man killed in fight over omelette in uppal

fight over omelette in Uppal, omelette, Man killed in fight over omelette, Mahankali wines, permit room, Pirziadiguda, Uppal, Vikas, Bablu, Langer House, Murder, Uppal police, Rachakonda Police, hyderabad, crime

A man was killed after being attacked by the staff of a liquor shop after a quarrel over omelette. The incident occurred at Uppal on Sunday evening. Getting into details, the victim, identified as Vikas (34) was a private employee and is a resident of Langer Houz. On Sunday, Vikas met his Bablu and the duo went to Mahankali wines in Uppal for a drink.

అరవై రూపాయల అమ్లెట్ కోసం.. అసువులు తీసారు..

Posted: 02/08/2021 05:11 PM IST
Hyderabad man killed in fight over omelette in uppal

మద్యం మత్తులో యువత చిక్కుకోకూడదని.. ఈ మత్తులో వారు ఎంతటి దారుణాలైనా పాల్పడుతున్నారని మన పెద్దలు వ్యక్తం చేసిన ఆందోళను మరోమారు నిజమైంది. మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తికి అమ్లెట్ తినాలని అనిపించమే అతని ప్రాణాలను బలిగొనింది. సరదాగా స్నేహితుడ్ని కలసి మద్యం సేవించాలని వచ్చిన ఆ వ్యక్తి తిరగిరాని లోకాలకు తరలివెళ్లగా.. అతని స్నేహితుడు మాత్రం తీవ్ర గాయాలతో అసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. అరవై రూపాయల అమ్లెట్.. నిండు ప్రాణాన్ని బలిగొనిందంటే ఎంతటి దారుణమో కదా..

ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమీషనరేట్ పరిధిలో గల ఉప్పల్ లోని మహంకాళి వైన్స్ షాపులో చోటుచేసుకుంది. ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేసే వికాస్ (35) ప్రతినిత్యం తన ఉద్యోగంతోనే బిజీగా వుంటాడు. దీంతో స్నేహితులను కూడా కలిసే సమయం లేక.. ఎలాగోలా తీరిక చేసుకుని తన స్నేహితుడు బబ్లూను కలవటానికి ఆదివారం సాయంత్రం.. తాను నివసించే లంగర్ హౌజ్ నుంచి పిర్జాదీగూడ బయలవచ్చాడు. కాసేవు ఇద్దరూ మంచిచెడులు మాట్లాడుకుని తరువాత మద్యం సేవించాలని నిర్ణయించుకున్నారు.

దీంతో పిర్జాధీ గూడ నుంచి ఉప్పల్ కు వచ్చిన వారు..  మహంకాళి వైన్స్ లో పరిట్ రూమ్ ఉందని అక్కడే మద్యం సేవించారు. ఇలా మద్యం సేవిస్తున్న సమయంలో వారికి ఆమ్లెట్ తీనాలనిపించింది. దీంతో అమ్మెట్ కు ఆర్డర్ ఇచ్చారు. రూ.60 ఇవ్వాలని దుకాణ నిర్వాహకుడు వికాస్ ను డబ్బులు అడిగాడు. అయితే ముందుగా తాము ఇచ్చిన అర్డర్ ను రెడీ చేయాలని, తరువాత డబ్బులు ఇస్తామని వికాస్ అన్నాడు. దీంతో దుకాణ యజమానికి వికాస్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ తమ మాటే నెగ్గాలని భీష్మించుకున్నారు.

ఈ క్రమంలో కొపోదిక్తుడైన దుకాణం యజమాని.. మద్యం దుకాణ సిబ్బందని కూడా పిలచి వికాస్, బబ్లూలపై పై దాడి చేశాడు. అయితే మద్యం దుకాణ సిబ్బంది వారిని వాదించవద్దనో.. లేక ఇంకేదోననో.. లేక రెండు కొట్టే అక్కడి నుంచి పంపించక.. వారితో బద్ద శత్రుత్వం వున్న వ్యక్తుల్లా తెగబడి మారీ ఇద్దరిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వికాస్ అక్కడే సృహకోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పోందుతూ చనిపోయాడు. అటు బబ్లూ కూడా తీవ్రంగా గాయపడి అసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles