రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సభలో ప్రసంగిస్తూ కొద్ది సేపు తన కన్నీళ్లుతో పోరాడాల్సి వచ్చింది. వాటిని బయటకు రానీయకుండా అపిన ఆయన.. ఈ క్రమంలో మంచినీళ్లు తాగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. గత రెండు నెలలకు పైగా చలిని కూడా తట్టుకుని అన్నదాతలు అందోళన చేస్తున్న నేపథ్యంలోనో.. లేక కరోనా మహమ్మారితో దేశంలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు పడిన కష్టాలు గుర్తుకువచ్చో కాదు.. ఆయన భావోద్వేగానికి గురయ్యారని అనుకుంటున్నారా.?
పుల్వామా దాడిలో ఏకంగా 40 మందికి పైగా జవాన్లు వీరమరణం పోందిన దాదాపుగా రెండేళ్లు కావస్తున్న తరుణంలో ఆ విషాదం గుర్తుకువచ్చి ఆయన కళ్ల చమర్చారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే అవన్నీ కాదు కానీ.. తన సహచరుడు, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు గులాంనబి అజాద్ పదవీ కాలాన్ని ముగించుకుని సభకు వీడ్కోలు చెబుతున్న సందర్భంలో.. ఆయనకు సభ ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ.. భావోద్వేగానికి గురయ్యారు. గులామ్ నబీ ఆజాద్ గురించి మాట్లాడినంత సేపూ, మోదీ భావోద్వేగంతోనే ప్రసంగాన్ని సాగించారు.
గులామ్ నబీ సేవలను కొనియాడిన ఆయన, భావితరాలకు ఆయన స్ఫూర్తిమంతుడని అన్నారు. ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర ఎంపీలకు, రాబోయే రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహం లేదని అన్నారు. ముఖ్యంగా కశ్మీర్ లో ఓసారి ఉగ్రదాడి జరిగిన వేళ, గుజరాత్ వాసులు అక్కడ చిక్కుకుని పోయారని గుర్తు చేసుకున్న మోదీ, ఆ సమయంలో ఆజాద్ తో పాటు ప్రణబ్ ముఖర్జీ గుజరాతీలను కాపాడేందుకు ఎంత శ్రమించారో తనకు తెలుసునని ఉద్వేగంగా మాట్లాడారు. తన సొంత కుటుంబ సభ్యులు చిక్కుకుంటే ఎంత శ్రమిస్తారో, ఆజాద్ అంత శ్రమించారని అన్నారు. ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తారన్న సంగతి తనకు తెలుసునని, కానీ ఆ వచ్చే వ్యక్తి ఆజాద్ ను మరిపించాలంటే చాలా కష్టమని అన్నారు.
"నాకు గులామ్ నబీ ఆజాద్ ఎన్నో ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నాం. అంతకుముందే ఎన్నో సార్లు కలసుకున్నాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఎంతో ముందుంటారు. ప్రకృతితో మమేకం అవుతుంటారు. ఉద్యానవనాల విషయంలో ఆయనకు చాలా తెలుసు. పదవులు వస్తుంటాయి. అధికారం దక్కుతుంది. కానీ వాటిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని ఎవరైనా ఆజాద్ ను చూసి తెలుసుకోవచ్చు" అని మోదీ వ్యాఖ్యానించారు. ఇక మోదీ మాట్లాడుతున్నంత సేపూ పలుమార్లు గులామ్ నబీ ఆజాద్ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ కనిపించారు.
అంతకుముందు షంశేర్ సింగ్ మన్హాస్ గురించి మాట్లాడిన మోదీ, "నా ప్రసంగాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను ఆయనతో ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. మా పార్టీని బలోపేతం చేసేందుకు ఆయనతో కలసి స్కూటర్ పై ప్రయాణించిన రోజులు నాకింకా గుర్తున్నాయి. రాజ్యసభలో ఆయన హాజరు అద్భుతం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు నేను ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాను" అని చెప్పారు. వారితో పాటు నజీర్ అహ్మద్ లావే, మొహమ్మద్ ఫయాజ్ తదితరుల సేవలనూ కొనియాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more