కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న బిపార్మసీ విద్యార్థినిన అటో డ్రైవర్ సహా ముగ్గురు కిడ్నాప్ చేయగా, తల్లిదండ్రుల పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వాయువేగంతో ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థిని రక్షించారు. శంషాబాద్ ప్రాంతంలో చోటుచేసుకున్న దిశ ఘటనను ఇక్కడ పునారావృతం కానీయకుండా సకాలంలో చర్యలు తీసుకున్న పోలీసలు యువతిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాంపల్లిలోని ఓ కాలేజీలో ఫార్మసి విద్యను అభ్యసిస్తున్న ఓ యువతి (19) క్రితం రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది.
కళాశాల నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చి నిల్చోగా.. ఒక ఆటో రావడంతో అందులో ఎక్కింది. అయితే అప్పటికే అందులో ఓ వృద్ధురాలితో పాటు మరో చిన్న పాప ఉండటంతో తాను కూడా ఎక్కింది. సత్యనారాయణ నగర్ వద్దకు రాగానే వృద్ధురాలు, పాప దిగడంతో అటోలో యువతి మాత్రమే వుంది. ఈ లోగా తాను దిగాల్సిన ఆర్ఎల్ఆర్ నగర్ స్టాప్ వచ్చినా డ్రైవర్ ఆటోను ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. అదే సమయంలో యువతి అరవకుండా ఇద్దరు యువకులు అమె నోరు మూసి గట్టిగా పట్టుకున్నారు.
ఆటోను ఘట్ కేసర్ మండలం, యంనంపేట వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే వారి నుంచి సమాచారం అందుకున్న ఓ వ్యక్తి అక్కడికి ఒక వ్యాన్ తీసుకురాగా, అందులోనికి యువతిని ఎక్కించారు. ఈ సమయంలో వారు బయట మాట్లాడుతుండగానే యువతి తన తల్లికి ఘటనపై సమాచారం అందించింది. దీంతో అమె తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. వెనువెంటనే స్పందించిన పోలీసులు యువతి సెల్ నెంబర్ ను ట్రాక్ చేస్తూ.. ఆటోను వెంబడించారు. యంనంపేట వద్ద ఆటో వుందని అక్కడికి వెళ్లారు. ఈలోగా యువతి ఎవరికో ఫోన్ చేసిందని అమెను చుట్టుముట్టిన నలుగురు అమెపై కర్రలతో దాడి చేశారు.
ఈ లోగా పోలీసులు చేరుకునే సరికి అమెను అక్కడే వదిలేసిన నిందితులు పారిపోయారు. గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రి తరలించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కీసర సీఐ నరేందర్ గౌడ్, ఘట్ కేసర్ పోలీసులు కలిసి విద్యార్థిని సకాలంలో రక్షించడంలో కిలక పాత్ర పోషించారు. ఘటనపై మల్కాజ్ గిరి డీసిపి రక్షితామూర్తి స్పందిస్తూ.. ఈ కేసును తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. సీపీ కెమెరాల ద్వారా ఘటనను విశ్లేషిస్తున్నామని, కిడ్నాప్‌నకు యత్నించింది ఎవరో.. ఎందుకు చేశారో పూర్తి వివరాల కోసం విచారణ జరుపుతున్నామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more