ఘట్ కేసర్ లో బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఏకంగా ఆరుగురు నిందితులు దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిందరినీ రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అత్యాచారం నేపథ్యంలో బాధితురాలికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అన్నోజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు.
రాంపల్లి ఆర్.ఎల్. నగర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని మేడ్చల్ లోని తన కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని కాలేజీ బస్సు దిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్తేందుకు అటోను ఆశ్రయించింది. అయితే సత్యనారాయణ నగర్ వద్ద అటోలోని ప్యాసెంజర్లు దిగిన తరువాత.. కొద్ది దూరంలోనే అమె దిగాల్సిన ఆర్ఎల్ నగర్ స్టాపు వచ్చినా.. అటోను అపకపోవడంతో కంగారు పడిన బాధితురాలు తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకుని సిగ్నల్ ఆధారాంగా అపస్మారక స్థితిలో వున్న అమెను అసుపత్రికి తరలించారు. పోలీసు వాహనాల సైరస్ విన్న నిందితుతు పారిపోయారు.
కాగా, నిందితుల్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన 10 ప్రత్యేక బృందాలు ముందుగా నాగారం సర్కిల్ లోని ఓ సీసీ కెమెరాలో కనిపించిన దృశ్యాల ఆధారంగా ఆ విద్యార్థిని ఎక్కిన సెవెన్ సీటర్ ఆటోను గుర్తించారు. దాని డ్రైవర్‌తో పాటు ఈసీఐఎల్, రాంపల్లి, యంనంపేట్, ఘట్‌కేసర్ మార్గాల్లో నడిచే ఆటోల డ్రైవర్లలో అనేక మందిని విచారించడంతో పాటు ఘటనాస్థంలోని సెల్‌ఫోన్ టవర్ల నుంచి సేకరించిన సాంకేతిక అంశాలు, నిర్దేశిత లొకేషన్లలో ఉన్న సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులందరూ యంనంపేట్ ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. వీరిలో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం.
మొత్తం ఆరుగురు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాన్ ను తో పాటు బాధితురాలిని అపహరించేందుకు వినియోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు వీరిని ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రాథమిక క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ కేసులో నిందితులు పక్కగా తమకు కావాల్సిన వారిని టార్గెట్ చేసి.. వారిని పక్షం రోజుల పాటు అబర్వేషన్ చేసిన తరువాత పక్కగా స్కెచ్ వేసి.. అవకాశం కోసం వేచి చూస్తారని.. అవకాశం దక్కగానే కోడ్ వర్డ్ ను స్నేహితులకు చేరవేసి ప్లాన్ అమలుపరుస్తారని తెలుస్తోంది.
ఇలాగే ఆర్ఎల్ నగర్ వద్ద దిగాల్సిన బాధితురాలైన ఫార్మసీ విద్యార్థిని.. అటో ఆపకుండా.. అమె అరవకుండా గట్టిగా నోరు మూసివేసి.. కదలకుండా అమెను పట్టుకుని యంనంపేట ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ అమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి తెగబడ్డారు. అయితే మత్తు మందు ఇచ్చినా బాధితురాలు తనపై జరుగుతున్న దారుణాన్ని అడ్డుకోవడానికి యత్నించడంతో అమెపై బలంగా దాడికి కూడా చేశారు. కాగా, బాధితురాలు తమ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆమె స్పృహలో లేదని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బాధితురాలికి అంతర్గతంగా గాయాలు ఉన్నాయని, తల, కాలిపై గాయాలు ఉన్నాయని, కర్రలు లేదా రాడ్లతో దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more