No FASTag? Pay twice the toll charge from February 16 ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు అదనపు వాయింపులు..

Fastags must from today midnight or else pay twice the toll charge from midnight

fastag, fastag last date, fastag last date news, fastag last date latest news, fastag mandatory, fastag mandatory in india, fastag mandatory date, fastag hdfc, fastag mandatory from dec 1, fastag sbi, fastag paytm, fastag online purchase, fastag sbi, fastag axis, fastag icici, fastag paytm, fast recharge online, fastag online, fastag online recharge, fastag how to apply, how to apply for fastag, fastag toll plaza, fastag charges, fastag price

The Road and Transport Ministry on said that any vehicle passing through tolls at National Highways has to pay double the toll if they don't have a valid FASTag. The rule will come into force from midnight of February 15-16.

ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు అదనపు వాయింపులు.. రాత్రి నుంచే అమలు

Posted: 02/15/2021 12:00 PM IST
Fastags must from today midnight or else pay twice the toll charge from midnight

టోల్ గేట్ల వద్ద పన్ను చెల్లింపులను సరళతరం చేసే ఫాస్ట్ ట్యాగ్ విధానం ఇవాళ అర్థరాత్రి నుంచి తప్పనిసరి చేసింది భారత రోడ్డు రవాణా సంస్థ. అయినా ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వెళ్లే వాహనాలకు షాక్ ఇచ్చేందుకు కూడా కేంద్ర రోడ్డు, రావాణా సంస్థ సిద్దమైంది. ఫాస్ట్ ట్యాగ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విధించిన గడువు ఇవాళ్టితో ముగిసిపోనుంది. ఈ గడువును మరోసారి పొడిగించబోమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం నాడు స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాదు ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాదారులకు అదనపు వాయింపులు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు.

దేశంలోని ప్రతీ వాహనం ఫాస్ట్ ట్యాగ్ లను తీసుకోవడం తప్పనిసరి అని ప్రకటించిన ఆయన ఇకపై కూడా ఫాస్ట్ ట్యాగ్ వినియోగించని వాహనాలు టోల్ గేట్ల వద్ద రెండింతల చార్జీ చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రధాన రహదారులతో పాటు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ట్రాఫిక్ ప్రవాహాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో టోల్ గేట్ల వద్ద ఉండే ప్రత్యేకమైన సెన్సర్లు వాహనంపై అమర్చిన ఫాస్ట్‌ట్యాగ్‌ను రీడ్ చేసి టోల్ చార్జీలను స్వీకరిస్తాయి.

ఈ మొత్తం వ్యవహారం ఆటోమెటిక్ విధానంలో, టోల్ సిబ్బంది కలుగ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే జరిగిపోతుంది. ప్రీపెయిడ్ విధానంలో ప్రేశపెట్టిన ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యాలెట్లలో నగదు అయిపోయిన ప్రతిసారీ వాహనదారులు రీచార్జ్ చేయడం ద్వారా నగదు నింపాల్సి ఉంటుంది. టోల్ గేట్ సిబ్బందికి చెల్లింపులు జరిపే పాత విధానాని ఫాస్ట్ ట్యాగ్‌ పద్ధతి ముగింపు పలకనుంది. ఫలితంగా.. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాల్సిన అగత్యం తప్పి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగిపోతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles