Most wanted in Red Fort violence case arrested ఎర్రకోట హింసాత్మక ఘటనలో మరో కీలక నిందితుడి అరెస్ట్.!

Red fort violence case delhi police arrests another accused two swords recovered

Red Fort violence, swords swung, manider singh, Farmers protest, Delhi Farmers Violence, tractor parade, New Agriculture laws, National, Politics, Crime

The Delhi Police arrested one the most wanted person in the Red Fort violence case near Delhi's Pitam Pura. Maninder Singh was held by the Special Cell of the Delhi Police, also two swords were recovered from his house in Swaroop Nagar.

ఎర్రకోట హింసాత్మక ఘటనలో మరో కీలక నిందితుడి అరెస్ట్.!

Posted: 02/17/2021 04:45 PM IST
Red fort violence case delhi police arrests another accused two swords recovered

గణతంత్ర దినోత్సవం రోజున కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిచిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి.. పలు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. తాజాగా ఆ రోజున ఎర్రకోటపై ఎక్కి తన కత్తి సాము విద్యాను ప్రదర్శించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు అత్యంత కీలక వ్యక్తి అని రైతులను, అక్కడికి వచ్చిన వీక్షకులను ఆయన కత్తి సాము హింసను ప్రేరేపించేలా వున్నాయని పోలీసులు పేర్కోన్నారు.

మణిందర్‌ సింగ్‌.. అనే స్థానిక ఏసీ మోకానిక్ ఎర్రకోట ఘటనలో కీలక నిందితుడిని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఎర్రకోట వద్ద కత్తులను ప్రదర్శిస్తూ.. సంఘవిద్రోహ శక్తులను హింసకు ప్రేరేపించినట్లు అప్పటి వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిని ఢిల్లీలోని స్వరూప్‌ నగర్‌లోని తన ఇంట్లోనే అరెస్టు చేసినట్లు డీసీపీ ప్రమోద్‌ కుశ్వాహా తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన మణిందర్‌ ఏసీ మెకానిక్ గా పనిచేస్తూనే... కత్తి సాము శిక్షణ స్కూల్‌ నడుపుతున్నాడు. గణతంత్ర దినోత్సవం రోజున తన అనుచరులతో కలిసి ప్రణాళిక ప్రకారం.. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీలో చేరి.. ఎర్రకోటకు చేరుకున్నాడు.

తన వెంట తల్వార్లు కూడా తెచ్చుకున్న మణింధర్ సింగ్.. వాటితో ప్రదర్శినిస్తూ.. సంఘవిద్రోహ శక్తుల్ని ఉసిగొల్పాడని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితుడి ఫొటోలు, వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. గణతంత్ర దినోత్సవ ఘటనలో సదరు నిందితుడు మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడని తెలిపారు. ఎర్రకోట ఘటనకు ముందు కూడా నిందితుడు పలుమార్లు సింఘు బార్డర్ కు వెళ్లి వచ్చినట్లు విచారణలో చెప్పాడని డీసీపీ ప్రమోద్‌ కుష్వాహా తెలిపారు. అతడి వద్ద నుంచి 4 అడుగుల పొడవైన రెండు కత్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles