జూనియర్ న్యాయాధికారితో సీనియర్ న్యాయమూర్తులు సరస సల్లాపాలకు పాల్పడటం న్యాయవ్యవస్థలో అమోదయోగ్యం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రవర్తన న్యాయవ్యవస్థను సైతం మాయనిమచ్చలా తయారవుతుందని పేర్కోంది. ఇలాంటి కేసులలో బాధితురాలు తన పిటీషన్ ను ఉపసంహరించుకున్నా.. తదుపరి విచారణకు సహకరించకున్నా.. న్యాయవ్యవస్థ అపఖ్యాతి పాలుకాకుండా వుండేందుకు అంతర్గత విచారణను చేపట్టాల్సిన అవసరం వుందని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని అత్యుత్తమ న్యాయస్థాన ధర్మాసనం తేల్చిచెప్పింది.
న్యాయమూర్తి హోదాలో బాధ్యతలను చేపడుతున్న వ్యక్తులు తమ జూనియర్ అధికారులతో సరసాలకు పాల్పడటం ఆమోదయోగ్య ప్రవర్తన కాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు విచారణ ఎదుర్కోంటున్న వ్యక్తి పదవిలో లేకపోయినా (పదవీ విరమణ పోందినా) విచారణ కోనసాగాల్సిందేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ జిల్లా న్యాయమూర్తి (ప్రస్తుతం విశ్రాంత జడ్జి) తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ న్యాయాధికారిణి ఒకరు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ వేశారు.
ఈ కేసును విచారణ జరుగుతున్న క్రమంలో అమె తన పిటీషన్ ను ఉపసంహరించుకున్నారని, దీంతో ఇక న్యాయస్థానం న్యాయమూర్తిపై కేసు విచారణ చేపట్టడంలో అర్థమే లేదని.. దీనిని ఇంతటితో ముగించాలని న్యాయమూర్తి తరపు న్యాయవాది ఆర్ బాలసుబ్రహ్మణ్యం సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కాగా, జూనియర్ మహిళా న్యాయమూర్తి అనవసర ఇబ్బందులను కొనితెచ్చుకోవడం ఇష్టంలేక తన పిటీషన్ ను ఉపసంహరించుకుని ఉండవచ్చునని.. అయినా శాఖపరంగా అంతర్గత విచారణను మాత్రం కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొప్పన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యంలు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో- తనపై విచారణను నిలిపివేయాలని, తాను హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందకూడదనే దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారంటూ సదరు విశ్రాంత న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత జిల్లా న్యాయమూర్తి అనుచితమైన, అసహ్యకరమైన వాట్సప్ సందేశాలు పంపారు. జూనియర్ అధికారిణితో సరసాలకు పాల్పడటం జడ్జిలకు తగదు. హైకోర్టు నిర్ణయం మేరకు ఆయన అంతర్గత విచారణను ఎదుర్కోవాల్సిందే’’ అని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more