కరోనా టీకా ‘కొరోనిల్’ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే దేశం నలువైపుల నుంచి డిమాండ్లు పెల్లుబిక్కుతున్న తరుణంలో ఆయన సంస్థ మరోమారు మీడియా ముందుకు వచ్చింది. తమ సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తున్న అరోపణలు అనవసరమైనవిగా తోసిపుచ్చింది. దేశానికి కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూ ఎలాంటి నాణత్య ప్రమాణాలు లేని, పరిశోధనా పలితాలు లేని పతాంజలి దివ్య కరోనిల్ ట్యాబెట్ల లాంచింగ్ కు ఎలా హాజరయ్యారని ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విమర్శలు చేసింది.
ఇది దేశానికే అవమానంగా.. దేశీయ వైద్యం, ఔషదాలపై అపనమ్మకం కలిగేలా ఈ చర్యలు వున్నాయని, ఒక అదునిక వైద్యుడిగా కొనసాగుతూనే ఆయన ఇలాంటి ఔషదాలను ఎలా విడుదల చేస్తారని, ఆయన ధీనిపై క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన ఈ విమర్శలతో కేంద్రమంత్రి హర్షవర్థన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. కాగా ఈ విమర్శల నేపథ్యంలో మరోమారు పతాంజలి సంస్థ మీడియా ముందుకు వచ్చింది. తమ సంస్థకు సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ ప్రోడక్ట్స్ నుంచి పోందిన సర్టిఫికేట్ వుందని పేర్కోన్నారు.
ఈ సర్టిఫికేట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అమోదం పోందిన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసులకు మాత్రమే భారత్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ అందిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే తామేు ఆయుష్ మంత్రిత్వశాఖకు తమ పరిశోధనల సారంశంలో కూడిన నివేదికను భారత ప్రభుత్వ కౌన్సిల్ ఫర్ మెడిసిన్ కు సమర్పించామని కూడా తెలిపింది. ఇలా పతంజలి అభివృద్ధి చేసిన ‘కొరోనిల్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సర్టిఫికెట్ ఉందని పేర్కొన్నారు. వాటిని అంశాల వారీ పరిశీలన తరువాత ఆయుష్ మంత్రిత్వశాఖ తమ పతాంజలి దివ్వ కరోనిల్ మాత్రలకు అనుమతిని మంజూరు చేసిందని పేర్కోంది.
కాగా, మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ నెల 19న రాందేవ్ బాబా కొరోనిల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొరోనిల్కు డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరణ ఉందని పేర్కొన్నారు. రాందేవ్ బాబా ప్రకటనపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొరోనిల్’కు తాము ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేని వివరణ ఇచ్చింది. దీంతో రాందేవ్ బాబాపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తప్పుడు ప్రకటనతో ప్రజలను మోసగించిన ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు కూడా వారితో గొంతు కలిపాయి. తాజాగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్ కూడా రాందేవ్ బాబాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాందేవ్ బాబా కోట్లాదిమందిని మోసం చేసే ప్రయత్నం చేశారని, దీనిని అంతర్జాతీయ మోసంగా చూడాలని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more