సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడికి ఆర్జిత సేవలు నిర్వహించేందుకు భక్తులు అసంఖ్యాకంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు ఆర్జిత సేవలకు నెల రోజుల కోటాను విడుదల చేసే టీటీటీ.. వాటిని భక్తులు సకాలంలో వినియోగించుకోవాలని ప్రకటిస్తారు. ఇక మరోవైపు మరికొన్ని సేవలకు లక్కీ డ్రా విధానం ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. అయితే కారోనా మహమ్మారి కారణంగా ఈ సేవలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కారించుకుని భక్తులకు ఈ ఆర్జిత సేవలను పునరుద్దరించాలని టీటీడీ పాలక మండలి ఇవాళ నిర్ణయం తీసుకుంది. తిరుమల దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో శనివారం టీటీడీ పాలక మండలి సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రథ సప్తమి రోజు లక్ష మంది భక్తులకు వాహన సేవలు వీక్షించే భాగ్యం కల్పించామని పేర్కొన్నారు. పాలక మండలి సమావేశంలో మండలి సభ్యులు 2021-22 సంవత్సరానికి రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు.
అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలల్లో వివాహాలు, దైవ కార్యాలకే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. టీటీడీ వేదపాఠశాలల పేర్లను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేర్లు మార్చాలని నిర్ణయించారు. తిరుపతిలోని బర్డ్‌లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి రూ.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నెయ్యి ధరలు పెరుగుతుండటంతో నిల్వ సామర్థ్యం పెంచాలని సూచించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ పవర్ వినియోగించాలని పేర్కొన్నారు. తిరుమలలోని రెస్ట్ హౌస్‌లు, సత్రాలు, కాటేజీల్లో విద్యుత్ వృథాను నియంత్రించడానికి ఎనర్జీ మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
కాగా శ్రీవారి మెట్టు మార్గంలో అన్నదానం చేయాలని బోర్డు నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని బోర్డులో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. తిరుచానూరు ఆలయ తులాభారం ఏర్పాటుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. శ్రీనివాస మంగాపురంలో అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయోధ్యలో టీటీడీ నిర్మాణాలు చేపట్టి సేవా కార్యాక్రమాలు నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more