దేశన్ని డిజిటల్ ప్రపంచం ముంగిట్లోకి తీసుకెళ్లాలని కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నేరగాళ్లు గండికొడుతున్నారు. ఎంతలా అంటే చమటోడ్చి ఆర్జించిన డబ్బును బ్యాంకుల్లో దాచుకునే సామన్య మధ్యతరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకున్న నేరగాళ్లు వివిధ రకాలుగా వీరిని మోసం చేసి వారి ఖాతాల్లోంచి డబ్బును కాజేసే యత్నాలు చేస్తున్నారు. ఇదివరకే ఓ పర్యాయం దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసుకున్న అర్థిక నేరగాళ్లు.. ఏకంగా 60 లక్షల మంది ఖాతాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని వారిలొ కొందరి ఖాతాల్లోంచి డబ్బును డ్రా చేసిన విషయం తెలిసిందే. దీంతో అర్బీఐ సూచనల మేరకు పాత క్రెడిట్ , డెబిట్ కార్డులను మార్చేసిన బ్యాంకులు ఆ స్థానంలో చిప్ వున్న కార్డులను అందించిన విషయం కూడా తెలిసిందే.
ఇన్ని మార్పులు చేసినా.. బ్యాంకు అధికారులు, అర్భీఐ కన్నా ఓ ఆకు ఎక్కువగానే చదివేస్తున్న సైబర్ నేరగాళ్లు మరోమారు ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్ చేసుకొని వల విసురుతున్నారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్బీఐ అధికారులు తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు రూ.9,870 విలువైన ఎస్బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానాస్పద టెక్స్ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌లో ఉన్న లింకుపై క్లిక్ చేసి పాయింట్లు రిడీమ్ చేసుకోవాలని మోసగాళ్లు ఎస్బీఐ కస్టమర్లకు మెసేజ్ పంపుతున్నట్లు న్యూ ఢిల్లీకి చెందిన సైబర్ పీస్ ఫౌండేషన్, సైబర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ తెలిపింది.
మొబైల్ కు వచ్చిన మెసేజ్ ను క్లిక్ చేసినట్లయితే మీకు నకిలీ వెబ్ సైట్‌కు ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ల్యాండింగ్ పేజీలో పాయింట్లు రిడీమ్ చేసుకోవడానికి పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇ-మెయిల్, పుట్టిన తేదీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఎంపిన్ వంటి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని సమర్పించాలని కోరుతుంది. ఇందులో మీరు కనుక ఎస్బీఐ విరాలను సమర్పిస్తే ఇక అంతే సంగతులు మీ డేటాను మోసగాళ్లు తస్కరించి మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు కొట్టేస్తారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లో ఉండే ఎస్బీఐ కస్టమర్లను మోసగాళ్లు టార్గెట్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందువల్ల మీరు ఇలాంటి మెసేజ్‌లతో జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more