యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు చవిచూస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు, పాలు,రవాణా, రైలు ప్రయాణాలు ఇలా ఒక్కటని కాదు.. ఎందెందు వెతికినా ధరాఘాతం కనిపించు అన్న నానుడి ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కరెక్టుగా అన్వయం చేసుకునేలా వుంది. ఇక ఈ దెబ్బతో రైళ్లను ప్రవేటుపరం చేయాలన్న అలోచనలతో వున్న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ అస్త్రంగా మారింది.
కరోనా సమయంలో మహమ్మారి నియంత్రణకు దేశంలోని రైల్వే వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ.. ఇక అన్ని వ్యవస్థలపై నియంత్రణను వదిలేసినా.. కేవలం రైల్వే, విదేశీయానం ప్రయాణాలపై మాత్రం ఇంకా నియంత్రణ విధించింది. ఈ క్రమంలో దేశంలోని పలు మార్గాలలో ప్రత్యేక రైళ్లను నడుపుతూ.. సాధారణ వేళ్లలో తీసుకునే చార్జీలకన్న అధికంగా చార్జీలను వసూళు చేస్తూ.. ప్రజలకు భారం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే టికెట్లను కూడా కేవలం అన్ లైన్ లో తీసుకోవాలని మెలిక పెట్టిన కేంద్రరైల్వే మంత్రిత్వ శాఖ అన్ లైన్ బుకింగ్ నేపథ్యంలో ఇంటర్ నెట్ చార్జీల రూపంలో మరో రూ.15 అదనంగా బాదేస్తోంది.
సాధారణ వేళల్లో టు సిట్టింగ్ టిక్కట్ ధరలు కేవలం పది నుంచి ప్రారంభం అవుతుండగా, కరోనా నెపంతో ఈ చార్జీలను కూడా భారీగా పెంచేసి.. సామాన్యుల అవసరాలనే అస్త్రంగా చేసుకుని ఎడాపెడా చార్జీలతో వాయిస్తోంది కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ. ఈ ప్రయాణాలపై దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాంతానికి సాధారణ సమయంలో రూ.15తో ప్రయాణించే వెసలు బాటు కాస్తా.. ఇప్పుడు ఏకంగా రూ.45 నుంచి రూ.75 వరకు చేరింది. ఇక దీనికి మరో పదిహేను రూపాయల అదనపు అంతర్జాల చార్జీ. వెరసి.. రూ.15 ప్రయాణాలకు పేద, మధ్యతరగతి వారు ఏకంగా రూ.100 ఖర్చచేయాల్సి వస్తోంది.
ఇది చాలదన్నట్టు తాజాగా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆ టికెట్ ధర రూ.10గా ఉంది. రైల్వేశాఖ ఒకేసారి రూ.20 పెంచి ఆ టికెట్ ధరను రూ.30గా నిర్ణయించింది. పెంచిన ధరలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని అన్ని జోన్లనూ ఆదేశించింది. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న వారు రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండవచ్చు. మరోవైపు, లోకల్ రైళ్ల టికెట్లను కూడా భారీగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లోకల్ రైళ్లలో కనీస చార్జీ రూ.30గా నిర్ణయించారు. దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోతోన్న నేపథ్యంలో అనవసర ప్రయాణాలకు అడ్డుకట్ట వేయడానికి చార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ చెప్పుకొచ్చింది. లోకల్ రైళ్లు, ప్లాట్‌ఫాంపై ఎక్కువ మందిని ప్రోత్సహించకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more