60 gangsters gang-raped girl for 1 month ఘార్ఖండ్ లో దారుణం: నెల రోజులుగా యువతిపై గ్యాంగ్ రేప్..

60 gangsters gang raped girl for 1 month used to inject drugs

Seraikela gangrape case, Jamshedpur girl gangrape, gangrape victim poor mental condition, needle marks on victim body, jharkhand gangrape case, saraekela gangrape case, gangrape in saraekela, SDPO Sanjay Kumar Singh, 60 man raped woman, Jharkhand, crime

A very surprising case has emerged from Seraikela in Jharkhand. A 22-year-old girl has alleged that 60 people have taken hostage for a month and committed gang-rape with her. The woman alleged that she was raped by giving her a needle. It is being claimed that the woman's mental condition is not right.

ఘార్ఖండ్ లో దారుణం: నెల రోజులుగా యువతిపై 60 మంది గ్యాంగ్ రేప్..

Posted: 03/06/2021 01:13 PM IST
60 gangsters gang raped girl for 1 month used to inject drugs

ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కాగా బహిర్భూమి కోసం వెళ్తున్నట్టు చెప్పిన ఆమె వారి నుంచి  చాకచక్యంగా తప్పించుకుని బయటపడడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.

దీంతో బాధితురాలి మానసిక పరిస్థితి కూడా దెబ్బతినిందని గ్రహించిన పోలీసులు అమెను చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అదే సమయంలో పోలీసలు బాధితురాలి ఇచ్చన పిర్యాదు మేరకు రంగంలో దిగి అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ లోని సరాయ్ కేలా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతిని 60 మంది సభ్యులు గల రౌడీల ముఠా అపహరించి అమెను సరాయ్ కేలా-ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీపంలో మూతపడిన గ్యారేజీలో తనను నెల రోజులపాటు బంధించారని, 60 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి తెలిపింది.

అయితే తనపై అత్యాచారం జరుగుతున్న సమయంలో తాను మత్తులోకి, మైకంలోకి జారుకునేలా నిత్యం తనకు ఇంజక్షన్ రూపంలో మాదకద్రవ్యాలు ఇచ్చేవారిన ఆమె పోలీసులకు తెలిపింది. వాటి ప్రభావంతో నెలరోజులుగా తనపై జరుగుతున్న దారుణాల బాధను తనలోనే అణిచివేసుకున్నందున్న అమె మానసిక పరిస్థితి కూడా క్షీణించిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి సమాచారం మేరకు అమె తెలిపిన ప్రాంతంలో తనిఖీలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే అమె శరీరంపై కన్నుల్లో, పాదాలపై మాత్రం ఇంజక్షన్ ఇచ్చిన గుర్తులు వున్నాయని వైద్యులు తెలిపారు.

కాగా ఈ దారుణ ఘటన నేపథ్యంలో బాధితురాలు చాలా వరకు మానసికంగా, శరీరికంగా అనారోగ్యంతో బాధపడుతోందని, అంతకుమించిన వివరాలు చెప్పలేకపోతోందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల చేతికి ఇప్పటికీ ఈ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన ఆధారాలు మాత్రం లభించలేదని తెలుస్తోంది. దీంతో బాధితురాలు కోలుకున్న తరువాత మరిన్ని వివరాలు సేకరించి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఈ దారుణాలకు పాల్పడింది ఎవరైనా, ఎంతటివారైనా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీడీఒ అధికారి సంజయ్ కుమార్ సింద్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles