Only weapon to stop steel plant privatisation: Ganta కేంద్రమంత్రి వ్యాఖ్యలపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన

Resignations are the only weapon to stop privatisation of visakha steel plant ganta

Ganta Srinivasa Rao, TDP MLA, Union Finance Minister, Niramala Sitharaman, Finance Minister, Vizag Steel Plant privatisation, Agitations, Trade Unions, Employees, VSP privatisation, Vizag Steel Plant privatisation, Privatization of PSU, Visakha steel plant, somu veerraju, ISPAT, Vishaka steel Plant, trade Union agitation, Visakhapatnam North Constituency, non-political JAC, Vishakapatnam, Andrha Pradesh, Politics

Former minister and TDP MLA Ganta Srinivasa Rao has said that resignation of MLAs and MPs would help to protect the Visakhapatnam steel plant. He blamed the ruling party leaders for still not coming forward for the resignations despite the centre's announcement that it would privatise the Visakapatnam steel plant.

"విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాజీనామాలే అస్త్రం": గంటా శ్రీనివాస్

Posted: 03/10/2021 01:34 PM IST
Resignations are the only weapon to stop privatisation of visakha steel plant ganta

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందశాతం ప్రైవేటీకరిస్తాం.. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని అమ్మేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు కోట్టినట్లు తమ నిర్ణయాన్ని వెల్లడించినా.. ప్రజాప్రతినిధులు తమ పదవులను త్యజించడానికి కూడా సిద్దపడకపోవడం అవివేకమని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుఅన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు రాజీనామాలే అస్త్రమని ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

నిర్మల సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో విశాఖలో ఒక్కసారిగా అలజడి రేగిందని, కార్మికులు, ఉధ్యోగులు, ప్రత్యక్ష, పరోక్షంగా అధారపడిన అందరితో పాటు స్థానికులు కూడా ఉద్యమంలో తాము భాగమే.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. ఆంద్రరాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం, సెంటిమెంటుతో ముడిపడిన అంశమని నినదిస్తున్నా.. అధికార పార్టీ నేతలు మాత్రం రాజీనామాలు చేయకుండా ఇంకా అలోచనలో పడ్డారని ఆయన తప్పుబట్టారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు.. ఉక్కు పరిశ్రమితో ఉన్న ఉపాధికి కార్మికులు దూరమవుతున్నా వైసీపీ ప్రజాప్రతినిధులు స్పందించరేమని ప్రశ్నించారు.

ఇక తాజాగా రాజీనామాల వల్ల ఉపయోగం లేదని.. రాజీనామాలు చేస్తే కేంద్రంలోని మంత్రులను, ప్రధానమంత్రిని కలవడం కూడా సాధ్యపడదని వైసీపీ నేతలు నుంచి బదులురావడంతో మరి ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ఎందుకు రాజీనామాలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం స్టీల్ ప్లాండ్ ప్రైవేటుపరం కాకుండా వుండాలంటే ప్రజాప్రతినిదులు అందరూ తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావడం ఒక్కటే మార్గమని గంటా అన్నారు. రాజీనామాలతో కేంద్రప్రభుత్వం స్టీల్ ప్లాంటుపై పునరాలోచన చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజీనామాలు బలమైన ఆయుధంగా ఆయన పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles