పుష్-అప్స్ సాధారణంగా ఇప్పటి యువత జిమ్ లలో చేస్తుంటారు. ఇక మధ్యతరగతి కుటంబాలకు చెందిన వారైతే ఇంట్లోనే చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతం యువత అయితే పోలాల్లోనే లేక, వ్యాయామ కేంద్రాల్లోనో చేస్తుంటారు. కానీ, ఎంతో సాహసంతో ఈ కుర్రాడు మాత్రం ఏకంగా కారుపైన పుష్-అప్స్ చేసి అందరిచేత ఔరా అనిపించుకున్నాడు. కారులో ఎవరూ లేని సమయంలో తానే కారును నడుపుతూ.. ఒక్కసారిగా స్టీరింగ్ సీటును వదిలి కారు టాప్ పైకి ఎక్కి.. అక్కడ పుష్-అప్స్ చేయడమంటే సాధారణ విషయం కాదు.
కేవలం సినిమాల్లో మాత్రమే నిష్ణాతులైన నిపుణుల చేత ఇలాంటి స్టంట్లు చేయిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం ఎలాంటి ముందజాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఏకంగా కారు పైన పుషప్స్ కొట్టాడు. తాను చేసిన సాహసాన్ని వీడియో తీయించి.. తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంకేముంది. ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎంతో శ్రమతో కూడిన ప్రాక్టీసుతోనే ఈ వీడియోలోని స్టంట్ చేశాడు. ఇది కాసింత అడ్డం తిరిగినా అతడికే ప్రమాదం.. అంతేకాదు ఎదురుగా వస్తున్న వాహనదారులకుకూడా ప్రమాదకరమే. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉజ్వల్ యాదవ్ అనే యువకుడు ఈ స్టంటు చేశాడు.
ఈ వీడియోపై సంబంధిత పోలీసులు కూడా బాగానే స్పందించారు. పుష్-అప్స్ అయితే బాగానే కొట్టావ్.. మరి, మా రివార్డు కూడా అందుకోవాలిగా.. రా రాజా వచ్చి మా రివార్డును అందుకో.. అంలూ ఉజ్వల్ యాదవ్ ఇంటికి చలానా పంపించారు. దానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘కొన్ని కొన్ని పుషప్ లు చట్టం కళ్లలో పడేలా చేస్తాయి. జర భద్రం’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియో తర్వాత ఓ సందేశాన్నీ ఇచ్చారు. ‘‘డ్రైవింగ్ చేసేటప్పుడు స్టంట్స్ చేయడం నేరం. దాని వల్ల మీకు, ఎదుటి వారికి ప్రమాదకరం కావొచ్చు’’ అని పేర్కొంటూ వీడియోను ముగించారు. ఇక, చేసిన తప్పునకు ఉజ్వల్ యాదవ్ క్షమాపణ చెప్పాడు. కారుపై ప్రమాదకర స్టంట్స్ చేసిన మాట నిజమేనని, ఇకపై ఎప్పుడూ ఇలా ప్రమాదకరంగా స్టంట్స్ చేయనని హామీ ఇచ్చాడు.
Some Pushups will only bring you down in the eyes of Law !
— UP POLICE (@Uppolice) March 13, 2021
Stay Strong, Stay Safe !#UPPCares #UPPolice pic.twitter.com/dvGSjtL2Az
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more