విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కానీయకుండా కాపాడుకునే ఉద్యమంలో భాగంగా ఇవాళ తలపెట్టిన ఉక్కు మహాగర్జనకు అంతా సిద్దమవుతున్న తరుణంలో ఓ కార్మికుడు రాసిన లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాగర్జనకు కార్మికులు సన్నధమవుతున్న తరుణంలో శ్రీనివాస రావు అనే ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసిన లేఖ స్థానికంగా తీవ్ర టెన్షన్ అలుముకునేలా చేసింది. సాయంత్రం 5:49 నిమిషాలకు ఫర్నేస్‌లో దూకి అగ్నికి ఆహుతి కాబోతున్నట్లు లేఖలో పేర్కొనడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. గాజువాకలోని సింహగిరి కాలనీలో నివసిస్తున్న ఉక్కు పరిశ్రమ కార్మికుడు శ్రీనివాసరావు.. స్టీల్ ప్లాంటులోని వ్తెర్ రాడ్ మిల్ విభాగంలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంటును స్ట్రేటజిక్ సేల్ ప్రకటన రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉక్కు ఫర్నేస్ లో అగ్నికి ఆహుతవుతానంటూ లేఖ రాసిపెట్టాడు. శ్రీనివాసరావు టేబుల్ వద్ద ఐడీ కార్డు, పర్సు, సెల్ ఫోను, లేఖ గుర్తించారు. ఈ లేఖపై పోలీసులు, కార్మికులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీనివాసరావు ఉదయం 5గంటల షిఫ్టుకు ప్లాంట్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన కోసం గాలిస్తున్నారు.
శ్రనివాస రావు రాసిన లేఖ సారాంశమిదే.!
‘‘ ప్రియమైన కార్మిక సోదరులారా.. మనందరం కలసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈరోజు జరగబోయే ఉక్కు కార్మిక మహాగర్జన ఒక మైలు రాయిగా నిలిచిపోవాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వొద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈరోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5.49 గంటలకు ముహూర్తం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుంచి మొదలు కావాలి. జై హింద్’’ అని శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు, నిర్వాసితులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. నిరసన దీక్షలు 35 రోజులు దాటినా కేంద్రం దిగి రాకపొవడంతో ప్లాంట్ ప్రైవేట్ పరమవుతుందని ఆందోళన చెందిన శ్రీనివాస్.. ఈ క్రమంలో రాత్రి ‘సి’ షిఫ్ట్‌కు వెళ్ళారు. అక్కడే సూస్తెడ్ నోటు రాసి అందరికీ షేర్ చేసాడు. అదే సమయంలో పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. ప్లాంట్‌లోనే శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో కలత చెందిన ఉక్కు కార్మికులు ఇటీవల జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా.. రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినా కేంద్రం వెనక్కి తగ్గలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more