HM Mahmood Ali say all under control in Telangana హైదరాబాద్ లో లాక్ డౌన్ పై హోంమంత్రి క్లారిటీ.!

All under control in telangana says home minister mahmood ali

corona virus deaths, coronavirus, corona second wave, coronavirus latest updates, coronavirus pandemic, coronavirus scare, coronavirus updates, covid, covid 19 deaths, covid scare, covid updates, covid-19, cyber tower, cyberabad, hitech city, home minister, hyderabad, hyderabad news, mohammed mahmood ali, raidurgam police station, Hyderabad, Telangana, Politics

Home Minister Mohammed Mahmood Ali said the situation was under control in the State and that the police was geared up to deal with the crisis effectively.

తెలంగాణలో లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూలపై హోంమంత్రి క్లారిటీ.!

Posted: 03/22/2021 05:06 PM IST
All under control in telangana says home minister mahmood ali

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ పోరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రలో కరోనా కేసులు ఏకంగా ముఫై వేలకు పైగా నమోదు కాగా, ఇటు కర్ణాటకలోనూ వేయికి మించిన స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల రాత్రివేళ కర్ప్యూలు అమలుతున్నాయి. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే కరోనాను కట్టడి చేయడం చాలా కష్టమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ లో త్వరలో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జోరందుకుంది. కనీసం వారంలో రెండు వారంతపు రోజులలో లాక్ డౌన్ విధించే అవకాశాలు వున్నాయని లేని పక్షంలో కనీసం రాత్రి పూట కర్ప్యూలు అమల్లోకి రావచ్చునని ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఈ విషయమై స్పందిస్తూ.. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ... తెలంగాణలో పరిస్థితులన్నీ అదుపులోనే వున్నాయని అన్నారు. లాక్ డౌన్ కానీ కర్ఫ్యూ కానీ విధించే స్థాయిలో ఇక్కడ పరిస్థితులు లేవని అన్నారు.

వీకెండ్ లాక్ డౌన్లు, రాత్రి కర్ఫ్యూలను విధించే అవకాశాలు ప్రస్తుతానికి లేవని.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తొలుత దెబ్బపడేది పేదవారికేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని లాక్ డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. అనేక మంది జీవితాలు, వ్యాపారాలు అతలాకుతలం అవుతాయని చెప్పారు. అయితే కేసులు పెరిగే క్రమంలో ప్రజలే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాఠశాలలు, మదర్సాలు పని చేయాలా? వద్దా? అనే విషయంలో ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona second wave  Lockdown  curfew  covid-19 scare  Hyderabad  Telangana  Politics  

Other Articles