Uddhav Thackeray's Wife Tests Positive For Coronavirus టీకా తీసుకున్నా.. కరోనా బారిన పడిన ఉధ్దవ్ థాకరే సతీమణి

Maharashtra cm uddhav thackeray s wife rashmi thackeray tests positive for covid

Rashmi Thackeray, Uddhav Thackeray, Aaditya Thackeray, COVID, corona virus deaths, coronavirus, corona second wave, coronavirus pandemic, coronavirus scare, coronavirus updates, covid, covid 19 deaths, covid scare, COVID-19 vaccine, Coronavirus vaccine, Covishield, Covaxin, covid vaccine above 45, covid vaccine for above 45, prakash javadekar, above 45 covid vaccine,co win app

After Maharashtra minister Aaditya Thackeray, his mother and chief minister Uddhav Thackeray's wife Rashmi Thackeray too tested positive for coronavirus. The chief minister and his wife had taken a first dose of the vaccine against coronavirus at the government-run J J Hospital on March 11.

టీకా తీసుకున్నా.. కరోనా బారిన పడిన ఉధ్దవ్ థాకరే సతీమణి

Posted: 03/24/2021 11:29 AM IST
Maharashtra cm uddhav thackeray s wife rashmi thackeray tests positive for covid

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి చాటుకుంటోంది. పాశ్చాత్య దేశాలలో ఇప్పటికే సెకెండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చినా.. భారత్ లో మాత్రం ఇప్పటివరకు క్రమంగా తగ్గిన కరోనా.. తాజాగా విజృంభిస్తోంది. దీంతో అనేకమంది ముందుజాగ్రత్త చర్యగా కరోనా వాక్సీన్ వేయించుకుంటున్నారు. టీకా వేయించుకుంటే కరోనావాక్సీన్ తమ దరి చేరదని నమ్మకంగా వుంటున్నారు. అయితే ఈ టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా ఓ వైద్యుడు, నర్స్ కరోనా బారినపడ్డారన్న వార్త దేశ ప్రజల్లో కొంత అందోళనకు దారి తీసింది.

ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్ ఒకరు జనవరి 18న కరోనా టీకా తొలి డోసు.. ఫిబ్రవరి 17న రెండో డోసు తీసుకున్నా కరోనా సోకింది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఎస్‌పీఎం సివిల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నితిన్ మిశ్రా ఫిబ్రవరి 15న తొలి డోసు, మార్చి 16న రెండో డోసు తీసుకున్నారు. తాజాగా, ఆయన చేయించుకున్న పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వెంటనే కోవాజ్గీన్ టీకా డోసుకు డోసుకు మధ్య వున్న వ్యవధిని 4 నుంచి 6 వారాల పాటు కాకుండా 4-8 వారాలకు పోడగించింది కేంద్రం.

ఇంతకీ ఇప్పుడీ విషయం ఎందుకంటారా..? తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కూడా కరోనా బారినపడ్డారు. అయితే అమె కూడా ఈ నెల 11న కరోనా టీకా వేయించుకున్న తరువాత అమె కరోనా బారిన పడటం గమనార్హం. అయితే అమె కేవలం ఒక్క డోసు మాత్రమే తీసుకున్నారు. కరోనా నిర్థారణ కావడంతో ఆమె వెంటనే హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. థాకరే దంపతులు ఈ నెల 11న ముంబైలోని జేజే ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. కాగా, రెండు రోజుల క్రితమే వారి కుమారుడు, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారినపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles