తెలంగాణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కన్నం వేసిన దొంగలు.. సినీపక్కీలో లాకర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసిన అందులోని నగదు, నగలతో ఉడాయించారు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా.. మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మొత్తం రూ.3.10కోట్ల విలువైన సొత్తును దొంగలు దోచుకెళ్లారు. బ్యాంకు గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు దొంగలకు సహకరించి వుంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులో ఏ మూల ఏముందో అన్న వివరాలు అన్ని తెలిసినట్టుగా దోంగలు వ్యవహరించిన తీరు ఈ అనుమానాలను బలపరుస్తోంది.
బ్యాంకు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి ప్రవేశించిన దొంగలు.. అంతకుముందుగానే అలారం మోగకుండా బ్యాటరీ కనెక్షన్ తీసేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తో లాకర్ బద్దలు కొట్టి అందులోని రూ.18.46 లక్షల నగదుతో పాటు రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఎంతో అనుభవం వున్న దొంగలా లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ బ్యాంకు సిసిటీవీ ఫూటేజీలో చోరీ దృశ్యాలు నిక్షిప్తం అవుతాయని తెలిసి.. సీసీ ఫుటేజీ డీవీఆర్ బాక్స్ ను సైతం వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసును పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే దొంగలు మరీ తెలివిమీరి ఉండటం పోలీసులకు విస్మయం కలిగిస్తోంది. వేలిముద్రలు సైతం దొరకకుండా దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకొని దోపిడీకి పాల్పడ్డారని రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును సవాలుగా తీసుకున్నట్లు చెప్పారు. నిందితులకోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more