corporator battu suryakumari attacked by miscreants విశాఖ మహిళా కార్పోరేటర్ పై దాడి.. మందుబాబుల పనేనా.?

Gvmc 77 division corporator battu suryakumari attacked by miscreants

Greater Visakha Muncipal corporation, 77 division, corporator battu suryakumari, battu suryakumari attacked by miscreants, battu suryakumari attacked by boozers, battu suryakumari attacked at golendibba, Appikonda, feliciation programme, GVMC, 77 Division, battu suryakumari, corporator, appikonda, penugonda mla adeepraj, palavalasa, visakhapatnam, Andhra Pradesh, Crime

Greater Visakha Muncipal corporation 77 division corporator battu suryakumari attacked by miscreants while returning to home from Appikonda. police said the miscreants are in their custody.

విశాఖ మహిళా కార్పోరేటర్ పై దాడి.. మందుబాబుల పనేనా.?

Posted: 03/29/2021 01:34 PM IST
Gvmc 77 division corporator battu suryakumari attacked by miscreants

విశాఖపట్టణం వైసీపీ కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి‌పై దుండగులు దాడిచేశారు. ఆమ ఇంటికి చేరుతున్నదారిలో అమె కారుపై సీసాలను విసిరి హంగామా చేసిన దుండగులు అదే వాయువేగంలో వెళ్లిపోయారు. ఈ దాడి నుంచి ఆమె క్షేమంగా బయటపడ్డారు. అప్పికొండలో నిన్న సూర్యకుమారికి అభినందన సభ ఏర్పాటు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి ఈ సభకు హాజరయ్యారు. సభ అనంతరం సూర్యకుమారి కారులో ఇంటికి బయలుదేరారు.

ఈ క్రమంలో ఆమె కారు పాలవలస సమీపంలోని గొలెందిబ్బ జీడితోటల వద్దకు చేరుకున్న సమయంలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి అమె కారును అడ్డుకున్నారు. మద్యం సీసాలతో కారుపై దాడిచేశారు. అమె కారు వెనకే మరో కారులో వస్తున్న వైసీపీ కార్యకర్తలు దీనిని గమనించి దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్తపై దుండగులు దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యారు. దాడిచేసిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

అయితే దుండగులు కార్పోరేటర్ సూర్యకుమారిపై దాడి చేసిన కారణం మాత్రం తెలియదని.. ఎందుకు దాడి చేశారోనన్న వివరాలను కూడా తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలను విపరీతంగా పెంచడంతో పాటు కనీవినీ ఎరుగని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు నిరసనగానే ఈ దాడి జరిగిందని తెలుస్తుంది. ఇది కాక మరేకారణమో పోలీసుల విచారణలో దుండగులు తెలియజేయాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles