ఈజీ మనీ కోసం దిగజారిపోయే చర్యలకు పాల్పడుతున్న ఓ ముఠా ధనదాహాన్ని ఓ 22 ఏళ్ల యువకుడి నిండు ప్రాణం బలైంది. వక్రమార్గంలో మనీ సంపాదించి.. జల్సాలకు వినియోగించే ముఠాలు మాటువేసివున్న ఈ సాంకేతిక విప్లవ రోజుల్లో అనుక్షణం అప్రమత్తంగా వుండాల్సిందేనని హెచ్చరిస్తున్న ఘటన ఇది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. అడ్డదారుల్లో డబ్బులు లాగేందుకు గుంటనక్కలాంటి ముఠాలు గొతికాడి నక్కల్లా కాచుకుంటాయి. అలాంటి ముఠా చేతితో చిక్కిన నిజామాబాద్ యువకుడు.. తన ఆశయాలు నాశనం అయ్యాయని, తన వాళ్లు తనపై పెట్టకున్న ఆశలన్ని అడియాశలయ్యాయని ముఠా వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
యువతి మత్తెక్కించే మాటలు.. ఆన్ లైన్లో పరిచయం అయిన కొద్ది రోజులకే యువకుడ్ని చిత్తు చేసి తన మైకం మత్తు కప్పింది. అంతే ఎప్పుడెప్పుడు అమె నుంచి ఫోన్ వస్తుందా.? అంటూ నిరీక్షించడమే యువకుడికి పెద్ద పనైపోయింది. ఒక అమె నుంచి అనుకోకుండా ఓ రోజు రాత్రి వేళలో ఫోన్ వచ్చింది. అంతే హాస్టల్ గదిలోకి వెళ్లిన యువకుడు ఆ ఫోన్ లిప్ట్ చేయగానే అది కాస్తా వీడియో కాల్. వామ్మో అని అనుకుంటున్నతరుణంలోనే యువతి తన ఒంటిపైనున్న దుస్తులు విప్పేసి నగ్నంగా తయారైంది.
ఈ చర్యలతో షాక్ తిన్న యువకుడు ఏంటిది అని అడిగేలోపు.. అతన్ని కూడా అలాగే తయారు కావాలని కోరింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. యువకుడు పూర్తి నగ్నంగా మారిన వీడియోతో పాటు యువతితో చేసిన పూర్తి సంబాషణను రికార్డు చేసిన యువతి.. తన ముఠాకు అప్పగించింది. అంతే అటు యువతి, ఇటు యువతి ముఠా నుంచి తరచూ పోన్లురావడంతో ప్రారంభమయ్యాయి. అందరూ డిమాండ్ చేసింది డబ్బులే. అడిగినంత ఇవ్వకుంటే ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామంటూ ముఠా సభ్యులు యువకుడిని బెదిరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని యువకుడు తన స్నేహితుల నుంచి తీసుకున్న మొత్తంగా రూ. 24 వేలను వారికి ట్రాన్స్ఫర్ చేశాడు.
అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండడంతో చేసేది లేక తన ఆశయాలకు చెదులు పట్టిందని, తనవారు తనపై పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయని భావించి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తన తల్తిదండ్రులను కళ్లారా చూశాడు. తనను క్షమించాలని తన మనస్సులోనే వేడుకున్నాడు. ఎక్కడ తన వీడియోను యువతి ముఠా నెట్టింట్లో పెడుతుందోనన్న భయంతో ఆ తర్వాతి రోజు ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
పొలానికి కొంత ఆలస్యంగా వచ్చిన వారి తల్లిదండ్రులు తమ చేతికందిన బిడ్డ అచేతనంగా మారడాన్ని గమనించి వెంటనే అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి యువకుడి మృతి చెందాడు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతితక విప్లవంతో అరచేతిలో ప్రపంచం వుందని భ్రమల్లో బతుకుతున్న యువత.. ఆదమరిస్తే అంతేసంగతులన్న విషయం కూడా తెలుసుకోవాల్సిందే. అనుకోకుండా వచ్చిన ఓ సందేశం.. ఏమీ కాదులే అని క్లిక్ చేస్తే.. డబ్బులు పోవచ్చు లేదా ప్రాణమే పోవచ్చు.. తస్మాత్ జాగ్రత్తా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more