బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త తెలియజేసింది. ఇన్నాళ్లు తమ శాఖను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకునేందుకు ఖాతాకు సంబంధించిన డాక్యుమెంట్లతో రెండు ప్రాంతాల్లోని శాఖలకు తిరగాల్సి వచ్చేంది. అయితే ఇకపై బ్రాంచిని మార్చుకోవాలనుకంటే బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. బ్యాంకు వెబ్ సైట్ లోకి వెళ్లి సంబంధిత వివరాలు పూర్తి చేసిన తరువాత వారం రోజుల్లో మీ ఖాతా మీరు కోరుకున్న శాఖకు బదిలీ అవుతుంది. కొన్ని రోజుల్లోనే మీ ఖాతా కావాల్సిన బ్రాంచికి బదిలీ అయిపోతుంది. కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఇంట్లోనే ఉండి బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకునేందుకు ఎస్బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ onlinesbi.comకి లాగిన్ కావాలి
పర్సనల్ బ్యాంకింగ్ పై క్లిక్ చేయండి
యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయండి
ఈ-సర్వీస్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ని ఎంచుకోండి
యువర్ అకౌంట్ టు బి ట్రాన్స్‌ఫర్డ్ ఆప్షన్ని ఎంపిక చేసుకోండి
బదిలీ చేసుకోవాల్సిన ఖాతాను సెలెక్ట్ చేసుకోండి
ఖాతాను బదిలీ చేసుకోవాలనుకుంటున్న బ్రాంచి ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను ఎంటర్ చేయండి
అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ బటన్ని నొక్కండి
మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ నొక్కండి
కొన్ని రోజుల్లోనే మీ ఖాతా బదిలీ అయిపోతుంది
ఎస్బీఐకి చెందిన యోనో యాప్, యోనో లైట్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more