Mumbai cop Sachin Vaze dismissed from service సచిన్ వాజేను శాశ్వతంగా తొలగించిన ముంబై పోలీసులు

Ambani security scare mumbai police terminates sachin vaze from service

sachin vaze, sachin vaze news, sachin vaze rank, sachin vaze latest news, sachin vaze mansukh hiren, sachin vaze age, sachin vaze shiv sena, antilia case, antilia bomb scare, antilia case full story, Antilia bomb scare case, Sachin Vaze, encounter specialist, vaze dismissed service, Mumbai Police

After twice suspending and reinstating him, the Mumbai Police has finally terminated Sachin Vaze from the department. 'API Sachin Waze has been dismissed from Police service with immediate effect. The order of dismissal has been issued under Article 311(2)(B) of the Constitution of India,' said Mumbai Police in a tweet.

సచిన్ వాజేను విధుల నుంచి శాశ్వతంగా తొలగించిన ముంబై పోలీసులు

Posted: 05/12/2021 02:33 PM IST
Ambani security scare mumbai police terminates sachin vaze from service

ముంబై పోలీస్ అసిస్టెంట్ ఇన్స పెక్టర్ (ఏపీఐ), ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేపే ముంబై పోలీసులు శాశ్వతంగా విధుల నుంచి తప్పించారు. రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ ఇళ్లు అంటిలియా వద్ద పేలుడు పదార్థాలు నింపిన వాహనాన్ని నిలిపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయినను విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ముంబై పోలీసు కమీషనర్ హేమంత్ నగ్రాలే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ మేరకు ఆయన ముంబై పోలీసుల అధికార ట్వీట్టర్ పేజీలోనే సచిన్ వాజేను శాశ్వతంగా విధుల నుంచి తప్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

1990 మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 49 ఏళ్ల వాజేకు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరుంది. ఇదివరకే ఒక పర్యాయం సుదీర్ఘకాలంగా ఆయన సస్పెషన్ కు గురయ్యారు. ఆ తరవాత శివసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయనకు విధులకు రీకాల్ లభించింది. అయితే సస్పెషన్ నేర్పిన గుణపాఠం నుంచి ఎలాంటి మార్పును అలవర్చుకోని ఆయన వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరేన్ హత్యకేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు దేశానికి చెందిన ప్రముఖ వ్యాణిజ్యవేత్త ముకేశ్ అంబానీ నివాసమైన ఆంటిలియా వద్ద పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపిన కేసులో వాజే ప్రమేయంపై ఎన్ఐఏ బలమైన సాక్ష్యాలు సంపాదించింది. వాజే ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మరోవైపు, వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరేన్ హత్య కేసును కూడా ఎన్ఐఏనే దర్యాప్తు చేస్తోంది. ఆంటిలియా వద్ద నిలిపిన కారు మన్‌సుఖ్ హిరేన్‌దే. తన కారు చోరీకి గురైందని ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. కారు చోరీకి గురి కావడానికి ముందు సచిన్ వాజే దానిని కొన్ని నెలలపాటు ఉపయోగించినట్టు హిరేన్ భార్య ఆరోపించారు. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేశ్ గౌర్, వాజే సహచరుడు రియాజ్ కాజీలు కూడా ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలో మహరాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసు విభాగం ఆయనను విధుల నుంచి శాశ్వతంగా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles