హైదరాబాదులోని కుత్బుల్లాపూర్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ భారీ విస్పోటనానికి భయభ్రాంతులైన స్థానికులు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అసలేం జరుగిందో తెలియకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ప్రాణలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. స్థానికుల నుంచి పిర్యాదులు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా అది నిజంగా బాంబు పేలుడేనని నిర్థారించుకున్నారు. అక్కడే తచ్చాడుతున్న ఓ అనుమానాస్పద వ్యక్తి అదుపులోకి తీసుకుని విచారించారు.
ఓ వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. భారీ పేలుడు శబ్దానికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. రెండు బ్యాగులు మోసుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి పేట్ బషీరాబాద్ ప్రాంతంలోని జయరాంనగర్ చౌరస్తా వద్ద ఒకదానిని విసిరేశాడు. అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. అంతా నిర్మానుష్యంగా వున్న వేళ విస్పోటనం సంభవించడంతో పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు వరకు వినిపించింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న పూజాసామగ్రి దుకాణం అద్దాలు బద్దలయ్యాయి. నిత్యం ప్రశాంతంగా వుండే ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కపడ్డారు.
కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి చేతిలో ఉన్న మరో బ్యాగును తెరిచేందుకు బాంబ్ స్క్వాడ్ ను రప్పించారు. అనంతరం దానిని తెరిచి చూడగా చెత్త ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని విచారించగా తనకు ఆ బ్యాగ్ బాలానగర్ లో దొరికిందని చెప్పాడు. అయితే కుక్కలు తాను మోసుకువస్తున్న ఆ బ్యాగ్ ను చూసి మొరుగుతుండడంతో దానిని పడేసినట్టు చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు... బ్యాగ్లో పేలుడు పదార్థాలను ఎక్కడికి తీసుకెళ్తున్నాడన్నది తేలాల్సి ఉంది. అసలే జనం కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వేళ... ఈ పేలుడు ఘటన స్థానికులను మరింత భయాందోళనకు గురిచేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more