కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విలయాన్ని సృష్టిస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. అయితే ప్రజల నుంచి ఒక్కసారిగా ఇంత భారీస్థాయిలో స్పందన రావడంతో కేంద్రం విస్మయం వ్యక్తం చేసింది. ఓ వైపు అటు కరోనా విజృంభనతో ఆక్సిజన్ సహా కరోనా చికిత్సకు అవసరమైన రెమిడిసివీర్ ఇంజక్షన్ కొరత.. మరోవైపు కరోనా వాక్సీన్ కొరత ఏర్పడింది. అయితే పలు దేశాలు ఆక్సిజన్ సహా కరోనా ఔషదాలను ఇండియాకు తమ సాయంగా పంపించాయి. అయితే రోజుకు నాలుగు లక్షల మేర కరోనా కొత్త కేసులు ఉత్పన్నం కావడంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర వైద్యారోగ్య విభాగాపు అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో కరోనా టీకా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఏకంగా 230 కోట్ల డోసులను సిద్దం చేస్తామని కేంద్రం తెలిపినా.. ఇప్పటికిప్పుడు ఏం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా వాక్సీన్ల కొరత రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది. అటు కేంద్రం తాజా డోసులను రాష్ట్రాలకు విడుదల చేయడం లేదని, దీంతో రాష్ట్రల్లో వున్న కోవాగ్జిన్ కోరతతో అనేక రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కోవాగ్జిన్ టీకాకు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కరోనా వాక్సీన్ వేయించుకుందామని ఇప్పటికే సంబంధిత యాప్ లలో రిజిస్టర్ చేసుకున్నవారు నిరాశకు లోనవుతున్నారు.
కోవాగ్జిన్ కోరత నేపథ్యంలో ఇదివరకే తొలి డోసు వేసుకున్న వారికి కూడా ఎదురుచూపులు తప్పడం లేదు. కోవాగ్జీన్ రెండో డోస్ వేసేందుకు స్టాక్ లేదని తెలంగాణ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో 45 ఏళ్లకు పైబడిన వాళ్లకు కోవాగ్జీన్ తీసుకుంనేందుకు వేచివుండక తప్పదని వెల్లడించింది. కోవాగ్జిన్ సప్లై తగినంత లేకపోవడంతో రెండో డోస్‌ను ఇప్పట్లో వేయలేమని తేల్చేసింది. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేదని ప్రకటించిన సర్కార్.. మళ్లీ వ్యాక్సినేషన్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఇటు మే నెల 1 నుంచి 18 ఏళ్లకు పైబడినవారందరికీ వాక్సీన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కానీ అందుకు సరిపడ మొతాదులో మాత్రం వాక్సీన్ ను రూపోందించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ప్రజలు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more