కరోనావైరస్ మహమ్మారి రెండోవ దశ తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందా.? అంటే ఔనని అనక తప్పదు. వారికి ఏప్రిల్ మాసం నుంచి అమలు కావాల్సిన నూతన వేతన సవరణ అందుకోవడంలో జాప్యం జరగడమే కారణం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరీక్షణ తప్పేట్టు లేదు. వేతనాలు పెంచినా, పెరిగిన జీతాలు అందుకోవడంలో జాప్యం జరుగుతూనే వుంది. ఏప్రిల్ నుంచి వేతన సవరణ బిల్లు అమల్లోకి వస్తుందని, ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పెరిగిన వేతనాలను అందుకోవడం కోసం ఉద్యోగులు గత నెల వేచి చూడగా, మరో నెల కూడా నిరీక్షించాల్సిన పరిస్థితులు ఇప్పడు ఉత్పన్నమయ్యాయి.
సవరించిన పీఆర్సీపై జీవోలు జారీ కాకపోవడంతో పెంచిన జీతాలు అందుకునే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినా ఉద్యోగులు ఆప్షన్లు తీసుకునే ప్రక్రియ కనీసం 20 రోజులైనా పడుతుంది. దీంతో ఈ నెల కూడా ఉద్యోగులకు పాత జీతాలే రానున్నాయి. సీఎం కేసీఆర్ కరోనా బారిన పడటంతో ఫైల్ పెండింగ్ లో ఉంది. ఎన్నో ఆందోళనలు, అనేక వాయిదాలు, సుధీర్ఘ నిరీక్షణ అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఉద్యోగుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ కమిటీ 7శాతం పిట్ మెంట్ పెంచుతూ సిఫార్సు చేసినా.. దానిని తోసిరాజుతూ ఏకంగా ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ను అసెంబ్లీలో ప్రకటించారు. పెంచిన వేతనాలను ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని కూడా అప్పుడే ప్రకటించారు.
అయితే ఏప్రిల్ నుంచి పెంచిన వేతనాలు అమలు కావాల్సింది. ఈ సవరించిన వేతనాలు మే 1న ఉద్యోగులకు అందాల్సివుంది. అయితే సీఎం కేసీఆర్ కు కరోనా సోకడంతో వేతనాల పెంపు ఫైల్ పై ఆయన సంతకం చేయలేదు. దీంతో మే నెలలో పెరిగిన వేతనాలను ఉద్యోగులకు అందుకోలేకపోయారు. అయితే కనీసం జూన్ 1వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని ఉద్యోగవర్గాలు తెలిపాయి. అయితే ఉద్యోగుల వేతన సవరణలకు సంబంధించి ఫైల్ పై ఇప్పటికీ సీఎం కేసీఆర్ సంతకం చేయలేదని.. జూన్ 1న కూడా ఉద్యోగులు పాత వేతనాలనే అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఉద్యోగులు తమ పెంచిన వేతనాలు అందుకునేందుకు మరో నెల రోజులు వేచి ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
సాధారణంగా ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బిల్లులను తయారు చేయడం, వాటిని ట్రెజరీలకు పంపించడం లాంటి పనులను 20వ తేదీ వరకు పూర్తి చేస్తారు. అయితే ఇప్పటివరకు ఫిట్ మెంట్ కు సంబంధించిన పెంపు ఫైల్ పై సీఎం సంతకం చేయకపోవడంతో మే నెలకు కూడా పాత వేతనాల ప్రకారమే బిల్లులను రూపొందిస్తున్నారు అధికారులు. కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న క్రమంలో.. ఆరోగ్యశాఖ మంత్రిగా వున్న ఈటెలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడంతో ఆ శాఖ కూడా బాద్యతలు కూడా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ అధికారులతో ప్రతిరోజు ఆయన సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బిజీగా వున్నారు. దీంతో ఈ నెలలోనూ ఆయన ఉద్యోగుల సవరించిన వేతనాల ఫైలుపై సంతకం చేయలేదు. దీంతో జూన్ లోనూ పాత వేతనాలే ఉద్యోగులకు అందనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more