తలిశెట్టి రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం మే 20వ తేదీని తెలుగు కార్టూనిస్టుల దినోత్సవాన్ని పత్రికారంగంలోని, ఫ్రిలాన్సింగ్ కర్టూనిస్టులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఇంతకీ ఎవరీ తలిశెట్టి రామారావు. ఆయనకు తెలుగు కార్టూన్లకు వున్న సంబంధమేంటి అన్న విషయాల్లోకి వెళ్తే.. తలిశెట్టి రామారావు తొలి తెలుగు కర్టూనిస్టు. తెలుగు కార్టూన్ వ్యంగ చిత్రాలను గుర్తుచేసుకునే ప్రతి సందర్భంలోనూ ప్రతి తెలుగు కార్టూనిస్టులు తలిశెట్టి రామారావుగారిని గుర్తు చేసుకుంటారు. వారికో నమస్కారం పెట్టుకోవడం తప్పనిసరి. ఇది వారు తలిశెట్టి రామారావుగారికి ఇచ్చే గౌరవం, వారి పాలిట గురుతర బాథ్యత కూడా ఈ ప్రక్రియ మారింది.
ఆయన కలం నుంచి జాలువారే వ్యంగ్య చిత్రాలపై ఆంధ్రపత్రిక ఇలా పేర్కొంది. ఈనాడు వ్యంగ్య చిత్రమని మనమనుకోంటున్న ధోరణిలో ప్రతికాముఖంగా తమ చిత్రానలు ప్రదర్శించినవారు శ్రీ తలిశెట్టి రామారావుగారు. రామారావుగారు 1906లో జయపురంలో జన్మించారు. వీరి తండ్రి ఆయన చిన్నతనంలోనే అంటే ఆయన జన్మించిన మూడేళ్లకే 1909లో మరణించారు. రామారావుగారి తల్లి కుటుంబాన్ని పోషించేందుకు గాను దుస్తులు కుడుతూ వుండేది.
1911లో డాక్టర్ గిడుగు సీతాపతిగారు జయపురం హైస్కూలులో ప్రధాన ఉపాధ్యయుడిగా ఉన్నప్పుడు రామారావు గారు వారికిక విధ్యార్థిగా వుండేవారు. జన్మతః రామారావుగారు చిత్రకారులు. వారు గీసిన కొన్ని బొమ్మలు సతాపతిగారు చూశారు. వారి ప్రతిభను గుర్తించారు, ‘అగ్స్ బర్గ్’ పుస్తకాలు చూసి కార్టూన్లు వేయడం ప్రారంభించాక రామారావు గారు తొలిసారిగా వేసిన కార్టూన్ సీతాపతిగారిదే. పర్లాకిమిడిలో ఇంటర్మీడియట్, విజయనగరంలో బి.ఏ చదివారు. జయపురం మహారాజు శ్రీ విక్రమ దేవవర్మ గారి అర్థిక సహాయంతో బి.ఎల్ చదివారు. పార్వతీపురంలో ప్రాక్టీస్ ప్రారంభించారు.
భుక్తి కోసం న్యాయవాద వృత్తిని చేసినా వారి ద్యాసంతా వ్యంగచిత్రాల మీదనే వుండేది. ప్రఖ్యాత మాసపత్రిక ‘భారతి’లో వారి కర్టూన్లు చాల ప్రచురించబడ్డాయి. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు ఆంధ్రపత్రిక, భారతి పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కార్టూన్ శకానికి నాంది పలికాడు.
విక్రమదేవవర్మ గారికి తలిశెట్టి వారంటే చాలా అభిమానం, ఆ కారణంగానే కావచ్చు రామారావుగారిని అసిస్టెంట్ దివాన్ గా నియమించారు. మంచివారిని ఎక్కువ కాలం భగవంతుడు భూమి పై బతకనివ్వకుండా తన వద్దకు రప్పించుకుంటాడనన్న నానుడి రమారావుగారి విషయంలోనూ నిజమైంది. 1960లో 54 ఏళ్ల వయస్సులోనే ఆయన అనంతలోకాలకు తరలివెళ్లారు. అయితే తాను కన్నుమూసే వరకు ఆయన కర్టూన్లు గీస్తూనే వున్నారు. తెలుగులో మొట్టమొదటి కర్టూనిస్టు శ్రీ తలిశెట్టి రామారావుగారే.!
తెలుగు కర్టూన్ పితామహుడైన తలిశెట్టి రామారావు గురించి ప్రముఖులు ఏమన్నారంటే..
* తెలుగు వ్యంగ్య చిత్రకారుల్లో తొలిశెట్టి రామారావు తలిశెట్టి. -బాపు
* మాట్లాడే బొమ్మలు -శ్రీరమణ
* కార్టూనింగ్ ఒక ఆల్కెమీ; ఒక మార్మిక విద్యేమో అని అనిపిస్తోంది. రసవాదం తెలిసినవాడే క్షుద్రలోహాల్ని బంగారం చేయగలిగినట్టు. ఆమర్మం తెలిసినవాడే వేయగలడేమో అనిపిస్తుంది. తలిశెట్టి రామారావు గారి కూర్టూన్లు చూస్తే. తెలుగునాట రామారావు గారు ఒక అద్భుతం. "ఇలాంటి విషయాలపైన కూడా కార్టూన్లు వేయవచ్చా?" అని అబ్బురపడతాం ఆయన కార్టూన్లు చూశాక. -శ్రీధర్. ఈనాడు కార్టూనిస్ట్
* కూనలమ్మ పదాలు: చిలిపి కుంచెను పట్టి శ్రీకారమును చుట్టి నవ్వించె తలిశెట్టి ఓ కూనలమ్మా! - ఆరుద్ర
తలిశెట్టి కర్టూన్లను పుస్తక ముద్రన చేసిన రమణారెడ్డి
తలిశెట్టి రామారావు గారి కర్టూన్లు ఇప్పటి తరం ప్రజలకు భావితరాల కర్టూనిస్టుకు మార్గదర్శకంగా వుంటాయనడంలో సందేహం లేదు. అయితే వీటిని వారిని అందించేందుకు కృషి చేసిన మహనీయులు యం.వి.రమణారెడ్డి గారు. పలువురి కర్టూనిస్టుల వద్ద వున్న తలిశెట్టి గారి కర్టూన్లను సేకరించిన ఆయన వాటితో ఓ పుస్తకాన్ని ముద్రించారు. ధృడనిశ్చయం వుంటే కాదన్నది లేదని ఆయన ఏడు పదుల వయస్సులో చేసిన పుస్తక ముద్రణ చెబుతోంది. అదెంటిదంటే.. 2011 సంవత్సరంలో వంద కర్టూన్లు సేకరించిన ఆయన పుస్తకం ప్రచురించడానికి సన్నద్ధం అయిపోయాడు. పుస్తకప్రచురణ భాద్యతను శ్రీశ్రీ విశ్వేశ్వర రావు గారికి అప్పగించారు, ఆయన కార్టూన్లన్నీ ప్రింటింగ్లో బాగా రావాలని వాటిని కంపూటర్లో సరిదిద్దే పని నాకప్పగించారు. సాక్షి శంకర్ గారు ముచ్చటయిన తలిశెట్టి గారి కేరికేచర్ తో, కార్టూనిస్టులు సర్వశ్రీ జయదేవ్ బాబు, మోహన్, శ్రీధర్, బాలి, శ్రీరమణ, బ్నిం లాంటి వారి ఆప్తవాక్యాలతో అందంగా అచ్చయిన పుస్తకాన్ని, అంత కంటే అద్భుతంగా కార్టూనిస్టులు సర్వశ్రీ మోహన్, సురేంద్ర, శేఖర్, శంకర్, కళాసాగర్ సమక్షంలో ఏప్రియల్, 2011 విజయవాడలో “సాహితీ మిత్రులు” ఆధ్వర్యంలో తెలుగు కార్టూనిస్టుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించుకొన్నాం.
తెలుగు కార్టూన్ రంగానికి పునాదులు వేసిన తలిశెట్టి రామారావు గారి జన్మదినమైన ‘మే 20’ తేదీను తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుకొని తీరాలని ఆనాటి సభలో తీర్మానిచ్చుకున్నారు. ఆ పుస్తకం మార్కెట్లోకి వెళ్ళింది. అద్భుతమైన స్పందన. సాక్షాత్తు తలిశెట్టి గారి కుమారుడు డా. జయరాం గారే ఫోన్ చేసి, మేము చెయ్యలేని పని మీరు చేసారు రమణారెడ్డి గారూ… థాంక్స్ అంటూ వారింటికి ఆహ్వానించారు. అభిమానంతో. దీనితో 74 ఏళ్ల నవయువకుడికి ఉత్సాహం వచ్చేసింది. వెంటనే ఒరిస్సాలోని ఉమర్ కోట వెళ్ళి డా. జయరాం గారిని కలిసారు. రమణారెడ్డి గారికి ఆత్మీయ ఆతిధ్యమిచ్చి, “మా తండ్రి గారి గురి ఇంతటి శ్రమకోర్చిన మీ రుణం తీర్చుకోలేనిది” అంటూ, మరొక పుస్తకం తీసుకురావడానికి కార్టూన్లు, చిత్రాలు, ఫొటోలు ఇవ్వడమే కాకుండా కొంత ఆర్థిక సహాయం కూడా చేసారు.
ఆ పుస్తకంలో ప్రచురించిన కార్టూన్లు, చిత్రాలు భారతి, ఆనందవాణి, వాణి పత్రికలలో ప్రచురించబడినవి. వీరి కార్టూన్లలో సినీతారలు, జంతువులు, పెళ్ళిళ్ళు, గవతులు, ఉద్యమాలు, సంగీతం ఇలా ఏ ఒక్కటిని విడిచి పెట్టలేదు. ‘ఆడవారి అలంకరణ గురించి వేసిన కార్టూన్ చూడండి, వారి అతి ముస్తాబుపై సునిశిత విమర్శకు పరాకాస్ఠ ఈ కార్టూన్. సినిమా ప్రారంభానికి ముందు అతిగా టైటిల్ను పొడిగిస్తే, ప్రేక్షకుడి పరిస్థితి ఎలా వుంటుందో ఎంత చక్కగా చూపించారో మరొక కార్టూన్లో, సంగీత ప్రదర్శన కార్టూన్ల్నో గాయకుని హావభావాలు చూస్తే నవ్వకుండా వుండలేము. అలానే ‘సౌందర్యమునకు హర్షించనివాడు పంది’ కార్టూన్లో మానవాకృతి పందిగా రూపాంతరం చెందే విధానాన్ని చూపించిన తీరు అద్భుతం. ఇది నేటి యానిమేషన్ స్టోరీబోర్డుకి ఏ మాత్రం తీసిపోని విధంగా వుందంటే అతిశయోక్తి కాదు. చిత్రకారుడుగా రామారావు గారు వందకు పైగా చిత్రాలు వేసినట్లు తెలుస్తుంది. ప్రియా సంగమం, కామిని కాముకులు, విరహిణి లాంటి చిత్రాలు సన్నటి గీతల్లో మనోహరంగా గీసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more