Telangana inter online classes postponed పాఠశాలలకు వేసవి సెలవును పొడిగింపు.. ఇంటర్ పరీక్షలు వాయిదా

Telangana extends summer vacation for school students till june 15

Reopening of schools, Telangana schools reopen, Summer vacation extended in Telangana, Telangana Intermediate board, Holiday extended, Telangana Education, School reopening in Telangana, TSBIE updates, TSBIE news, TSBIE website, Telangana colleges, Telangana academic calendar, when will online classes begin, Telangana online classes

Telangana Government has extended summer holidays for all the schools including those run by private managements and government schools till June 15, 2021, in view of the pandemic situation. TSBIE has postponed the commencement of online classes of the current session until further notice.

పాఠశాలలకు వేసవి సెలవును పొడిగింపు.. ఇంటర్ పరీక్షలు వాయిదా

Posted: 05/31/2021 07:54 PM IST
Telangana extends summer vacation for school students till june 15

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, పాఠశాలలతో పాటు డైట్ కాలేజీలకు ఈ వేసవి సెలవుల పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నామని, అందుకే సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.

 ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు, రేపటి నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, నేడు చేసిన మరో ప్రకటనలో, రేపు ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్ లైన్ తరగతులను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఆన్ లైన్ క్లాసులు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తేదీ ప్రకటిస్తామని వివరించారు. ఇక, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల కోసం రేపటి నుంచి (www.tsbie.cgg.gov.in) ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles