ఆయన ఓ న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన వ్యక్తి. ఆయన తన కుమారుడికి ఫోన్ చేసి.. తన బ్యారెక్ లో వున్న వ్యక్తి వద్ద కత్తి ఉందని, దీంతో తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని భయాందోళనతో చెప్పాడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ముఖ్యమంత్రి జగన్ ను ఎదిరించేంతటి వ్యక్తివా.. నీ అంతు చూస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డారని ఈ విషయాన్ని కూడా తన తండ్రి తమకు ఫోన్ ద్వారా సమాచారం అందించారని ఆయన కుమారుడు తెలిపారు. ఇంతకీ ఆ న్యాయమూర్తి ఎవరు.? అంటే జడ్జి రామకృష్ణ. ఆయన కుమారుడు ఇవాళ మీడియాతో తన తండ్రికి జైలులో ప్రాణహాని వుందని వంశీకృష్ణ అందోళన వ్యక్తం చేశారు,
తన తండ్రి నుంచి వచ్చిన ఓ ఫోన్‌కాల్ తమను ఆందోళనకు గురిచేస్తోందని, ఆయన బ్యారెక్ లోనే ఉంటున్న ఓ వ్యక్తి బెడ్డింగులో కత్తి బయటపడిందని వంశీకృష్ణ తెలిపారు. తన తండ్రిపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆయన అందోలన వ్యక్తం చేశారు. తనతో మాట్లాడుతుండగానే జైలు సిబ్బంది ఆయన నుంచి ఫోన్ లాక్కున్నారని అన్నారు. బ్యారక్ లో ఉన్న వ్యక్తి తన తండ్రిని బెదిరించాడని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జగన్‌ను ఎదిరించేంతటి వాడివా? నీ అంతు చూస్తానంటూ జడ్జి రామకృష్ణను ఇటీవల బెదిరించాడని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు అతడి వద్ద కత్తి దొరకడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురికి లేఖలు రాసినట్టు తెలిపారు.
రామకృష్ణకు ఏమైనా జరిగిన మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జైలు అధికారులు తన తండ్రితో మరోసారి ఫోన్ చేయించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పించే ప్రయత్నం చేశారని వంశీకృష్ణ చెప్పారు. కాగా, రామకృష్ణ బ్యారక్‌లో కత్తి దొరికిందన్న వార్తలపై జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. అది కత్తికాదని, మరుగుదొడ్డిలో పదునుగా ఉన్న ఓ ప్లాస్టిక్ ముక్కను చూసి రామకృష్ణ కత్తి అని అనుకున్నారని, అదే విషయాన్ని కుమారుడికి ఫోన్ చేసి చెప్పారని అన్నారు. బ్యారక్‌లో కత్తి దొరికిందన్న వార్తల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదని వేణుగోపాల్‌రెడ్డి కొట్టిపడేశారు. కాగా, ఈ అంశంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more