ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లి అక్కడ క్యూ పద్దతిలో టెస్టు డ్రైవ్ ఇచ్చిన తరువాత అందులో ఏలాంటి తప్పులు లేకపోతే అప్పుడు అధికారులు డ్రైవింగ్ లైసెన్సులు జారి చేస్తుంటారు. పోరబాటునో గ్రహపాటునో తప్పిదాలు జరిగాయంటే మళ్లీ ఏదో ఒక ముహాూర్తన మరో పరీక్ష ఇవ్వాల్సి వుంటుంది. అలా కానీ పక్షంలో లైసెన్సు రాదు, ఇక లైసెన్సు లేకపోతే వాహనాలను నడిపేందుకు అవకాశం వుండదు. దీంతో కొందరు బ్రోకర్లును నమ్మి మోసపోతుంటారు. ఇక కొందరు ఈ టెస్టు ఏంట్రా దేవుడా అని వాపోతుంటారు. అయితే వీరికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొంత ఉపశమనం కలిగించింది. ఎలాంటి టెస్టులు లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
ఔనా.. ఎప్పట్నించీ తాజా ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి అంటున్నారా.. జులై ఒకటి నుంచి. జులై 1నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ఇకపై, ఎలాంటి డ్రైవింగ్ పరీక్ష లేకుండానే లైసెన్స్ జారీ చేయనున్నారు. కొత్త నిబంధనలకు కేంద్ర రహదారి, రవాణాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగా అని ఎగిరి గంతేయకండీ ఇక్కడా ఒక మెలిక పెట్టింది. అదేంటంటే.. కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం.. గుర్తింపు పొందిన (అక్రిడేటెడ్) డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో సిమ్యులేటర్, ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ తప్పనిసరి. ఈ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ పరీక్ష పూర్తిచేసిన అభ్యర్థులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించరు.
ఫలితంగా అక్రిడేటెడ్ కేంద్రాల్లో డ్రైవింగ్ నేర్చుకున్న వారికి శిక్షణ పూర్తయిన వెంటనే లైసెన్స్ పొందే అవకాశం లభిస్తుంది. కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన గుర్తింపు పొందాలంటే కనీసం ఎకరా స్థలం అవసరం. వీటితోపాటు భారీ ప్యాసింజర్, సరుకు రవాణా వాహనాలు, ట్రెయిలర్స్ నడపడంలో శిక్షణ ఇవ్వాలనుకుంటే కనుక రెండెకరాల స్థలం ఉండాలి. రెండు తరగతి గదులతోపాటు కంప్యూటర్, మల్టీమీడియా ప్రొజెక్టర్‌ను కూడా ఉపయోగించాలి. తేలికపాటి, భారీ వాహనాల శిక్షణ తరగతుల కోసం సిమ్యులేటర్స్‌ను ఉపయోగించాలి.
శిక్షణ కేంద్రానికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ తప్పనిసరి. బయో మెట్రిక్ అడెండెన్స్ వ్యవస్థ, అర్హులైన శిక్షకులు, ఈ-పేమెంట్ సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. శిక్షణ ఇచ్చే వాహనాలకు బీమా తప్పనిసరి. శిక్షకులకు కనీసం 12వ తరగతి విద్యార్హత ఉండి, డ్రైవింగ్ లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. దీంతోపాటు మోటార్ మెకానిక్స్‌లో ప్రొఫిషియన్సీ టెస్ట్ సర్టిఫికెట్ అవసరం. డ్రైవింగ్ స్కూల్ కు ఒకసారి మంజూరు చేసే అక్రిడిటేషన్ ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more