తెలంగాణ ఉద్యమంలో తాను ఓ సమిధనై పోరాడి సాధించినా.. అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీలో ఏడేళ్లు మంత్రిగా చేసినా.. తన ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట తాను మనజాలనని పేర్కొంటూ టీఆర్ఎస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించి, అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మేట్లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన ఈటల.. సాయంత్రం ఢిల్లీ వెళ్లి 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు.
ఈ సంధర్భంగా మాట్లాడిన ఈటల.. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా ప్రజల్లో ఉన్నాను. తెలంగాణ కోసం అసెంబ్లీ వేదికగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రశ్నించాను.. పోరాడాను.. ఇతర పార్టీలలో గెలిచి టీఆర్ఎస్లో చేరి చాలామంది మంత్రులు అయ్యారు. చట్టాన్ని అతిక్రమించి టీఆర్ఎస్ పార్టీలో చేరినవాళ్లూ ఉన్నారు. వందల, వేల కోట్లు ఉన్న వాళ్ళను వదిలేసి తనలాంటి బిడ్డపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్ ప్రజలకు కేసీఆర్ కుటుంబం మధ్య ఘర్షణ జరగబోతోంది. హుజురాబాద్ లో కౌరవులు- పాండవుల మధ్య కురుక్షేత్రం జరగబోతోంది. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు.
రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రజల సమస్యలు పట్టవు కానీ, ఎమ్మెల్సీ-ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ సమీక్షలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు ఈటల. వందల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంది. ఈటలకు జైళ్లు- కేసులు కొత్త కాదు. ఈటెల రాజేందర్ డిఎన్ఏ లౌకిక వాదం. పార్టీ పెట్టి నడపాలని చాలామంది నాకు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం మేధావులతో కమిటీ వేస్తాం అన్న మాట గంగలో కలిసింది. తెలంగాణలో చైతన్యం-సంఘాలు- ఐక్యత ఉండొద్దు అని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులరా.. హుజురాబాద్ కదిలి రండి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం రాబోయేకాలంలో పోరాటం చేస్తా అంటూ ఈటల ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more