కడప జిల్లా పులివెందులలో ఇద్దరు దాయాదుల మధ్య రేగిన వివాదం కాల్పులకు దారితీసింది. మండలంలోని నల్లపురెడ్డి పల్లిలో దాయాదుల మధ్య రేగిన ఆస్తి వివాదం నేపథ్యంలో ఒకరిని మరోకరు తుపాకీతో కాల్చి చంపి.. క్షణికావేశంలో చేసిన తప్పును తెలుసుకుని తననుతాను కాల్చుకొని మరణించిన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో రేగిన వివాదమని కొందురు అంటుండగా, మరికోందరు పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు చెబుతున్నారు. అయితే భార్యభర్తల పంచాయితీలో భార్యకు అనుకూలంగా తీర్పును వెలువరించినారని భర్త పగబట్టి హతమార్చేందుకు యత్నించగా తప్పనిసరి పరిస్థితుల మధ్య గత్యంతరం లేక తనను తాను రక్షించుకునే క్రమంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది.
పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి కాల్చిచంపాడు. హతులు ఇద్దరూ దాయాదులు అవుతారు. గ్రామంలో ఎదురెదురు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో పార్ధసారధి రెడ్డి కత్తితో ప్రసాద రెడ్డిపై దాడికి చేసేందుకు యత్నిస్తుండగా… ప్రసాద రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ పోందిన రివాల్వర్ తో పార్ధసారధి రెడ్డిపై కాల్పులు జరిపాడు. పార్ధసారధి రెడ్డి శరీరంలోకి రెండు బుల్లెట్లు తగిలాయి. మూడో బుల్లెట్ లోడ్ చేసే లోగానే పార్ధసారధి రెడ్డి కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందిన ప్రసాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకోని చనిపోయాడు.
మాజీ ఎంపీటీసీగా ఉన్నటువంటి ప్రసాదరెడ్డి గ్రామపెద్దగా వ్యవహరిస్తూ చిన్న చిన్న సమస్యలకు, తగాదాలకు అక్కడే పరిష్కారం చేసేలా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలో పంచాయతీలు చేస్తూ గ్రామపెద్దగా పేరు పొందిన ఆయన గతంలో భార్యభర్తల సమస్యలతో తన వద్దకు వచ్చిన శివప్రసాద్ రెడ్డిని మందలించి బుద్ది చెప్పాడు. దానిని జీర్ణం చేసుకోలేని పార్థసారధీ రెడ్డి ఇవాళ ఉదయం కత్తి చేత పట్టుకుని దాయాధి శివప్రసాద్ రెడ్డిపై దాడికి యత్నించగా, ఆయన తన తుపాకీతో కాల్చిచంపాడు. ఆ తరువాత ఆత్మరక్షణకు ఇలా చేశానని సమర్థించుకోకుండా తన కోపం వల్ల తన దాయాది మరణించాడని కుమిలిపోయాడు.
ఆ వెంటనే తనకు ధాయాధిని కాల్చి చంపాడనే అపవాదు వస్తుందనే అవమాన భారంతో తనను తాను కాల్చుకుని ఆత్నహత్య చేసుకున్నాడు. గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రసాదరెడ్డి, గతంలో పార్ధసారధి రెడ్డి కుటుంబం భార్యా భర్తల విషయంలో పంచాయతీ చేసినట్లు తెలుస్తోంది. ఆ పంచాయతీలో తనకు అన్యాయం జరిగిందని భావించిన పార్ధసారధి రెడ్డి, శివప్రసాదరెడ్డిపై కక్ష పెంచుకుని ఈరోజు ఉదయం దాడిచేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తనను తాను రక్షించుకోటానికే శివప్రసాద రెడ్డి కాల్పులు జరిపినట్లు ప్రాధమికంగా సమాచారం అందుతోంది. పోలీసులు గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేసి శాంతిభద్రతలు పరిరక్షిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more