Pak NGOs 'mop up' fund raised to help India భారత్ పేరున విరాళాలు.. ఉగ్రవాద సంస్థకు సమర్పకాలు

Imana raised funds by exploiting india s goodwill during covid 19 crisis

Charities, Coronavirus lockdown, Coronavirus Outbreak, Coronavirus Pandemic, Coronavirus Scare, Covid Aid Scam 2021, COVID-19Outbreak, DisinfoLab, Hamas, IMANA, Islamic Medical Association of North America, Islamists, Pakistan,US

Funds worth tens of crores donated by well-meaning people from world over to help India in times of Covid crisis were stolen, DisinfoLab said in a disclosure. The Islamic Medical Association of North America (IMANA) collected money in the name of Covid crisis in India from all over the world, including from countries where India had sent Covid vaccines

భారత్ పేరున విరాళాలు.. పాక్ ఉగ్రవాద సంస్థకు సమర్పకాలు

Posted: 06/19/2021 02:53 PM IST
Imana raised funds by exploiting india s goodwill during covid 19 crisis

కరోనా సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతున్న భారత్ కు ఊపిరిని అందించేందుకు సాయపడండీ అంటూ అగ్రరాజ్యం అమెరికాలోని ప్రజలను అర్థించిన ఓ మతోన్మాద స్వచ్ఛంధ సంస్థ సేకరించిన విరాళాలను భారత్ కు అందించకుండా.. భారత దేశంతో పాటు ప్రపంచ వినాశనం కోరుకుంటున్న ఓ ఉగ్రవాద సంస్థకు అందించడం సంచలనంగా మారింది. భారత్ ను ఆదుకుంటామంటూ అమెరికాలోని పాకిస్థాన్ స్వచ్ఛంద సంస్థ భారీ కుంభకోణానికి తెరలేపడాన్ని అగ్రరాజ్యంలోని ఓ సంస్థ ఇన్వెజ్టిగేషన్ లో బట్టబయలు అయ్యింది. కరోనా రెండవ దశ నేపథ్యంలో భారత్ ను అదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వున్న స్వచ్చంధ సంస్థలు తమ వంతు సాయాన్ని అందించాయి.

అయితే భారత్ కు సాయం అందించేందుకు ముందుకు వస్తున్న సహృదయులను.. భారత్ పై వారికున్న ప్రేమాభిమానాలను అసరాగా చేసుకుని.. ‘హెల్పింగ్ ఇండియా బ్రీత్’ పేరుతో లక్షలాది డాలర్లను విరాళాలుగా సేకరించిన ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (ఇమానా) పేరుతో ఉద్భవించిన ఓ స్వచ్చంధ సంస్థ భారత్ కు సాయం అందిస్తామంటూ బూటకపు మాటలు చెప్పి అగ్రరాజ్యంలోని పలువురి నుంచి లక్షలాధి డాలర్లను పోగు చేసింది. అయితే ఇలా సేకరించిన డాలర్లను ఈ సంస్థ ఉగ్రవాదుల చేతుల్లో పోసింది, అంతేకాదు పాకిస్థాన్ సైన్యం, మత ఛాందసవాదులు, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేతుల్లో పోశాయి.

ఈ వివరాలను డిస్‌ఇన్‌ఫ్లో ల్యాబ్ నివేదిక వెల్లడించింది. దీనిని ‘కొవిడ్ కుంభకోణం 2021’గా అభివర్ణించింది. భారతదేశానికి సాయం పేరుతో పాక్ స్వచ్ఛంద సంస్థలు ఏప్రిల్ 27, 28 తేదీల్లో అమెరికాలో విరాళాలు సేకరించాయి. ఇలా సేకరించిన వాటిలో ఇమానా ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంస్థ కూడా ఉంది. ఇది పెద్ద ఎత్తున విరాళాలు సేకరించింది. ఇస్మాయిల్ మెహర్ అనే వైద్యుడి ఆధ్వర్యంలో ఈ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో తొలుత రూ. 1.8 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన రావడంతో లక్ష్యాన్ని రూ. 5 కోట్లకు పెంచింది. అయితే, అది కూడా మించిపోయి ఏకంగా రూ. 8.7 కోట్లు సమకూరాయి.

ఇలా మొత్తం 150 కోట్ల వరకు విరాళాలు సేకరించిన సంస్థ వారి నిర్ధేశిత లక్ష్యాన్ని గాలికి వదిలేసింది. అయితే సంస్థ భారత్ కు సాయం చేస్తుందని లక్షలాది డాలర్లు విరాళంగా ఇచ్చిన వారు భారత్ కు తమ విరాళం చేరి ఉంటుందని.. తాము సాయం చేయగలిగామని భావిస్తుంటారు. కానీ నిజానికి భారత్ కు ఈ సంస్థ నుంచి ఎలాంటి సాయం అందలేని భారత ప్రభుత్వం తెలిపింది. ఇందులో రూ. 30 కోట్లు ఖర్చు చేసి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మాస్కులు, ఇతర వైద్య సామగ్రిని కొనుగోలు చేసి భారత్‌కు అందించినట్టు తెలిపింది. అయితే, ఈ సంస్థ నుంచి ఎలాంటి సాయమూ అందలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles