కరోనా మూడవ దశ వస్తుందని, అది పిల్లలపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుందన్న వార్తలతో ఇప్పటికే చిన్నారులున్న తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. మూడవ దశ రాకుండానే ఇప్పట్నించే అభంశుభం తెలియని చిన్నారులను ఆంక్షల వలయంలో బంధిస్తున్నారు. అయితే తాజాగా ఓ వార్త చిన్నారులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా కాసింత ఊరట కలిగిస్తుంది. పుణెకు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనంలో తట్టు (మీజిల్స్) రాకుండా వాక్సీన్ తీసుకున్న చిన్నారులపై కరోనా ధర్డ్ వేవ్ పెద్దగా ప్రభావం చూపదని, వారికి దరికి కూడా కరోనా చేరదన్న వార్తను వెల్లడించారు.
ఈ వాక్సీన్ తో చిన్నారులకు కొవిడ్ నుంచి కూడా రక్షణ లభిస్తున్నట్లు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఒకవేళ ఈ వ్యాక్సిన్ వేసుకున్న పిల్లలకు కొవిడ్ సోకినా.. దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటున్నట్లు కూడా స్పష్టమైంది. పుణెలోని బీజే మెడికల్ కాలేజీ ఈ అధ్యయనం నిర్వహించింది. కరోనా వైరస్‌పై మీజిల్స్ వ్యాక్సిన్ 87.5 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. హ్యూమన్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునోథెరప్యూటిక్స్ జర్నల్‌లో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. పిల్లల్లో మీజిల్స్ వ్యాక్సిన్ కొవిడ్ నుంచి దీర్ఘకాల రక్షణ కూడా అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ప్రపంచంలో ఇలాంటి అధ్యయనం ఇదే తొలిసారి. మేము ప్రధానంగా ఎంఎంఆర్ వ్యాక్సిన్లపైనే దృష్టి సారించాం. ఎందుకంటే కొవిడ్‌లోని అమినో యాసిడ్ సీక్వెన్స్ రూబెలా వైరస్ లోని దాంతో 30 శాతం పోలిక ఉంది. ఇక కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ కూడా మీజిల్స్ వైరస్‌లోని హెమాగ్లుటినిన్ ప్రొటీన్‌లాగే ఉంది. అందుకే వాటిపై అధ్యయనం చేశాం. ఫలితాలు సానుకూలంగా వచ్చాయి అని రీసెర్చర్లలో ఒకరైన డాక్టర్ నీలేష్ గుజార్ వెల్లడించారు. ఇక ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ పిల్లల్లో కొవిడ్ సృష్టించే సైటోకైన్ స్టార్మ్‌లను కూడా అడ్డుకోవడంలో సాయం చేస్తాయనీ తేలినట్లు చెప్పారు. అందుకే ఈ మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు వెంటనే తీసుకోవాలని, తొలి డోసు తీసుకున్న వారు కూడా రెండో డోసు తీసుకోవాలని సూచించారు.
ఇండియాలో పిల్లలకు 9-12 నెలల మధ్య వయసులో తొలి డోసు, 16-24 నెలల వయసులో రెండో డోసు మీజిల్స్ వ్యాక్సిన్ ఇస్తారు. అధ్యయనంలో భాగంగా ఏడాది నుంచి 17 ఏళ్ల వయసున్న 548 పిల్లలను పరిశీలించారు. వీళ్లను రెండు గ్రూపులుగా విడదీశారు. ఇప్పటికే కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వాళ్లు, ఇప్పటి వరకూ దాని బారిన పడని వాళ్లను వేర్వేరు గ్రూపులుగా చేశారు. వీళ్లలో మీజిల్స్ వ్యాక్సిన్లు తీసుకొని కొవిడ్ బారిన పడిన వాళ్లలో చాలా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తేలింది. అదే వ్యాక్సిన్ తీసుకోని వాళ్లలో కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అని అధ్యయనం తేల్చింది. మీజిల్స్, బీసీజీ వంటి వ్యాక్సిన్లు పిల్లలకు కొవిడ్ నుంచి రక్షణ కలిగిస్తున్నట్లు పలువురు పరిశోధకులు భావిస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ఆ దిశగా తొలి అడుగు వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more