కరోనా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. తొలిదశతో పాటు రెండవ దశలోనూ ప్రవేటు అసుపత్రులు చేరిన రోగుల కుటుంబాలను భయాందోళనలకు గురిచేసి వారి నుంచి లక్షలాధి రూపాయలను వసూలు చేశాయి, ఈ మేరకు పలువురు రోగులు మీడియాకు తమ ఆవేదనలను కూడా చెప్పుకున్నారు. ఎంతగానో తమను కష్టపెట్టినా చివరకు తమ వారిని చూడటానికి కూడా అనుమతించకుండా చర్యలు తీసుకున్నాయని కూడా అరోపించారు. మరీ ముఖ్యంగా నగరాల్లోని కార్పోరేట్, ప్రైవేటు, చైన్డ్ అసుపత్రుల ఆడగాలకు అడ్డులేకుండా పోయింది.
అసలు ఆసుపత్రులలో ఏ రకమైన వైద్యం ఇస్తున్నారో కూడా తెలియకుండా లక్షల రూపాయలను వసుళ్లు చేసిన ప్రైవేలు అసుపత్రులు తమ వారి మృతదేశాలనే అప్పగించాయి తప్ప ప్రాణాలతో తమవారిని అప్పగించలేదన్న అరోపణలు కూడా మనం విన్నాం. కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన వైద్యులు.. కార్పోరేట్, ప్రైవేటు అసుపత్రుల చేతుల్లో కీలుబోమ్మలై.. వారు చెప్పినట్లుగానే రోగుల కుటుంబసభ్యులను భయాందోళనకు గురిచేసి లక్షల రూపాయలను వారి నుంచి పిండేశాయన్న అరోపణలు వున్నాయి. ఈ క్రమంలో రోగుల బంధువులు, కుటుంబసభ్యలు నుంచి తీవ్రస్థాయిలో పిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం కదిలి చర్యలు తీసుకుంది.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకన్న చందంగా వున్నా.. మూడో దశ కరోనా వస్తుందన్న నేపథ్యంలోనైనా ఈ ధరలు ప్రజలకు మేలు కలిగేలా చేయనున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ట ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్స ఛార్జీలపై వైద్యారోగ్య శాఖ జీవో 40 జారీ చేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేలు, ఐసీయూ వార్డులో రోజుకు గరిష్టంగా రూ. 7,500 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ. 9 వేలుగా ఖరారు చేశారు. పీపీఈ కిట్ ధర రూ. 273కు మించరాదని తెలిపింది.
హెచ్ఆర్ సీటీ స్కాన్ – రూ. 1995, డిజిటల్ ఎక్స్‌రే – రూ. 1300, ఐఎల్6 – రూ. 1300, డీ డైమర్ పరీక్ష – రూ. 300, సీఆర్పీ – రూ. 500, ప్రొకాల్ సీతోసిన్ – రూ. 1400, ఫెరిటిన్ – రూ. 400, ఎల్ డీహెచ్ – రూ. 140గా ఖరారు చేశారు. సాధారణ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 2 వేలు, కిలోమీటర్‌కు రూ. 75, ఆక్సిజన్ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 3 వేలు, కిలోమీటర్‌కు రూ. 125గా ఖరారు చేశారు. కాగా ఈ ధరలను మించి వసూళ్లు చేసిన పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేటు అసుపత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more