పోలీసు ఉన్నతాధికారుల మధ్య మాటామాటా సమాధానాలు పరిస్థితి దాటి వాగ్వాదానికి దారితీసాయి. అంతటితో ఆగకుండా ఒకరిపై మరోకరు చేయిచేసుకునే వరకు వెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పర్యటన సందర్భంగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వాహనంలోని సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు.. కులు జిల్లా పోలీస్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచుసుకుని కొట్లాటకు దారితీసింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే చేయిచేసుకోవడంతో ఈ గోడవకు కారణమైన ముగ్గురు అధికారులను రాష్ట్ర పోలీసు అధికారులు బలవంతపు సెలవులపై పంపించారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని భున్తర్ విమానాశ్రయం సమీపంలో సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు షిమ్లాలోని పోలీస్ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు సీఎం పర్యటన సందర్భంగా విమానాశ్రయం బయట గుమికూడారు. ఈ విషయమై సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేశారు. కులు ఎస్పీ గౌరవ్ సింగ్‌ను నిలదీశారు. దాంతో సహననం కోల్పోయిన గౌరవ్ సింగ్ సీఎం భద్రతా సిబ్బందిలోని అదనపు ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్‌ను చెంపదెబ్బ కొట్టాడు.
దాంతో సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) బల్వంత్ సింగ్.. గౌరవ్సింగ్ను కాలితో తన్నాడు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సంఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులను విచారణ ముగిసే వరకు సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుందు తెలిపారు. ప్రస్తుతం కులు ఎస్పీ బాధ్యతను డీఐజీ (సెంట్రల్ రేంజ్) మధుసూదన్ చూసుకుంటారని చెప్పారు. అలాగే బ్రిజేష్ సూద్ స్థానంలో పండోహ్ 3వ బెటాలియన్ చెందిన ఏఎస్పీ పునీత్ రఘును నియమించినట్లు తెలిపారు.
Altercation between Kullu SP and Himachal CM's security personnel during Gadkari's visit to Kullu.
— Sidharth Shukla (@sidhshuk) June 24, 2021
DGP Sanjay Kundu said Kullu SP Gaurav Singh had been transferred to Range Office Mandi.#HimachalPradesh #himachal #bjp #HPgovt #shimla #kullu pic.twitter.com/Qc8F5PEnaz
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more