Police busts rave party at Nashik villas రేవ్ పార్టీపై పోలీసుల రైడ్.. అదుపులో బిగ్ బాస్ కంటెస్టెంట్ సహా 22 మంది

Nashik police busts rave party at nashik villas actors choreographers detained

Rave, drugs, igatpuri villas, rave-party, Bigg Boss Fame Actress, SkyTaj Villa, SkyLagoon Villa, Nashik Rural SP, Sachin Patil. busted, Iranian-descent, Nigerian national, Nashik, Maharashtra, Crime

As many as 22 people were detained after the police cracked down on a rave party in Maharashtra’s Nashik district. The police raided two adjoining villas, Sky Taj Villa and Sky Lagoon Villa, in Nashik’s Igatpuri, 120 km away from Mumbai. Among those detained by the people are actors and choreographers working with the Hindi film and television industry.

రేవ్ పార్టీపై పోలీసుల రైడ్.. అదుపులో బిగ్ బాస్ కంటెస్టెంట్ సహా 22 మంది

Posted: 06/28/2021 12:25 PM IST
Nashik police busts rave party at nashik villas actors choreographers detained

మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారులు ఇప్పటికే సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు చెందిన కేసులో మాదకద్రవ్యాల కోణం ఉందని, దీంతో దానికి సంబంధమున్న వివిధ రంగాలకు చెందినవారికి నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగిస్తున్న తరుణంలో... సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు అదే మహారాష్ట్రలోని నాసిక్ కు వెళ్లి.. అక్కడి విలాసవంతమైన విల్లాల్లో ఆదమరచి నిర్వహించిన రేవ్ పార్టీలో 22 మందిని ఇగాత్ పురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దక్షిణాది సినీపరిశ్రమకు చెందినవారు వున్నారని వార్తలు వినబడుతున్నాయి.

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నాసిక్ లోని ఇగాత్ పురి పరిధిలో రెండు జంట విల్లాల్లో నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీపై పోలీసులు దాడులు జరిపారు. వీరిలో బిగ్ బాస్‌ మాజీ కంటెస్టెంట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అందించిన వివరాల మేరకు... నాసిక్‌లోని ఇగాత్ పురి ప్రాంతంలోగల మానాస్ రిసార్టులోని స్కై తాజ్‌,  స్కై లగూన్ అనే రెండు ఖరీధైన విల్ల్లాల్లో రేవ్‌ పార్టీ నిర్వహించారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి అక్కడి పార్టీలో మునిగితేలిన యువతీ యువకులు మత్తులో జోగుతున్నారు.

మొత్తంగా 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిలో 10మంది పురుషులు కాగా, 12 మంది మహిళలు ఉన్నారు. వీరిలో బిగ్ బాస్‌ మాజీ కంటెస్టెంట్ తో పాటు దక్షిణాది పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. రైడ్ సందర్భంగా పోలీసులు రేవ్ పార్టీ నిర్వాహకుల నుంచి భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలతో పాటు విల్లాల్లో సేవించగా మిగిలిని విదేశీ మధ్యం సీసాలతో పాటు హుక్కాలు పడి ఉండగా వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రేవ్ పార్టీలో పాల్గొన్నవారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు వారిని న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. వీరిలో మోడల్స్‌, నటులు సహా కొరియోగ్రాఫ‌ర్లుగా అని సమాచారం. నిందితులను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ పార్టీ నిర్వహించడానికి సహాయపడిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రేవ్‌ పార్టీకి వచ్చిన వాళ్లలో చాలామంది ఖరీదైన కార్లలో ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles