JK Police arrests LeT commander Nadeem Abrar భారత భద్రతా బలగాల విజయం: ఎల్ఈటీ టాప్ కమాండర్ అరెస్ట్

Let commander nadeem abrar arrested in budgam big success for security forces

J-K Police, LeT commander, Nadeem Abrar, Parimpora, Security Forces, Baramulla Border, Jammu Crime

Lashkar-e-Taiba (LeT) commander Nadeem Abrar was arrested on Monday from Narbal area of Budgam district along with his close associate. He was involved in several killings and attacks along the Srinagar-Baramulla Border. He has also been allegedly involved in attacks on security forces.

భారత భద్రతా బలగాల విజయం: ఎల్ఈటీ టాప్ కమాండర్ అరెస్ట్

Posted: 06/28/2021 08:34 PM IST
Let commander nadeem abrar arrested in budgam big success for security forces

జమ్మూకశ్మీర్ లోని భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగిన ఘటనలో ఉగ్రసంస్థ లష్కర్ ఏ తోయిబాకు సంబంధాలు వున్నాయన్న వార్తలతోఅప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి క్షణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో జమ్మూలో టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ని భద్రతా దళాలకు చిక్కాడు. శ్రీనగర్ శివార్లలోని పరిమ్ పొరా వద్దనున్న ఓ చెక్ పోస్ట్ వద్ద నదీమ్ సహా మరో అనుమానితుడిని భద్రతాధికారులు అదుపులోకి తీసుకన్నారు.

వీరిని తనిఖీ చేయడంతో వారి వద్ద ఓ పిస్టోల్,ఓ గ్రనేడ్ లభ్యమయ్యాయని.. వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని భద్రతాధికారులు తెలిపారు. కాగా, కశ్మీర్ లో పౌరులపై మరియు భద్రతా దళాలపై పలు దాడుల్లో నదీమ్ ప్రమేయం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో లవాయ్ పొరాలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది హత్య వెనుక నదీమ్ హస్తముందని స్థానిక పోలీసులు తెలిపారు. అనేక హత్యతత్లో నదీమ్ హస్తం ఉందని..అతడి అరెస్ట్ తమకు పెద్ద విజయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఓ ట్వీట్ లో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J-K Police  LeT commander  Nadeem Abrar  Parimpora  Security Forces  Baramulla Border  Jammu Crime  

Other Articles