తెలుగు ప్రేక్షకులను తమ హక్కుల కోసం ఉధ్యమించాలని జాగృతపరుస్తూ.. తన సినిమాలతో బిజీగా వుండే సినీనటుడు, దర్శకుడు, ఆర్ నారాయణ మూర్తి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి ఈ నటుడిని ఇప్పుడు హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా వున్నా ప్రజాసమస్యల పరిష్కారంలో.. ప్రజాఉద్యమాల్లో మాత్రం తాను ఏనాడు వెనకడుగు వేయరు. అదే ఆయన అరెస్టుకు కారణమైయ్యింది.
ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే తన గళం విప్పుతాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు రోడ్ల మీద నినాదాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. అందులో ఎంతోమంది రైతులు పాల్గొన్నారు. వాళ్లకు తోడుగా మూర్తన్న కూడా తన కాళ్ళు కదిపారు.
అయితే అక్కడికి వచ్చిన పోలీసులు ఆందోళనకారులను వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా.. పోలీసుల మాటలు వినిపించుకోకుండా రాజ్ భవన్ ను ముట్టడించడానికి కొందరు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్థానిక పోలిస్ స్టేషన్లకు తరలించారు. అందులోనే ఆర్.నారాయణమూర్తి కూడా ఉండటం గమనార్హం. నూతన వ్యవసాయ సాగు చట్టాల ద్వారా రైతులు నష్టపోతున్నారని వెంటనే వెనక్కి తీసుకోవాలని నారాయన మూర్తి డిమాండ్ చేశారు.
ఈ తరహా చట్టాలు రావడం ఇది ప్రథమం ఏమీ కాదని.. 2006లోనే అప్పటి బీహార్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఫలితంగా ఆ చట్టాలతో బీహార్ రైతులు ఎంతో నష్టపోయారని తెలిపారు. అప్పటి రైతులు ఇప్పుడు కూలీలుగా మిగిలిపోయారు. ఈ సారి అలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ఈ చట్టం వెనక్కి తీసుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం నారాయణమూర్తి అరెస్టు విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more