కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్న ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ గూటికి పాత నేతలు చేరుకుంటారన్న వార్తలు జోరుగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నగరంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్దమైందన్న వార్తలు వినబడుతున్నాయి. కాగా వీటిపై ఇవాళ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.
రేవంత్ రెడ్డి మాటలకు మూతి, తోక ఏది ఉండదని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. ఇక గుంజుకునుడే అంటున్నాడని.. ఇక్కడ గుంజుకోవడానికి ఎవడబ్బ సొమ్ము కాదన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా? నా మీద జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. క్రిమినల్ కేసులు పెట్టాలని కోరాను. తన ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని.. కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ఆ పార్టీలో ఏముంది? కాంగ్రెస్‌లో ఓ వర్గం తనను భాదించినందుకే తాను బయటకు వచ్చానన్నారు. తాను నమ్ముకున్న నేత ఉన్నంత వరకూ ఆ నేత వెంటే ఉంటానని అన్నారు.
కాంగ్రెస్ లో సీనియర్లకు చీము, నెత్తురుంటే బయటకు రావాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి నిన్న వచ్చిన రేవంత్ కింద సీనియర్లుగా పనిచేస్తారా? ఆలోచించుకోవాలని సూచించారు. రేవంత్ అదృష్టం బాగుండి వీహెచ్ హాస్పిటల్ లో ఉన్నాడని అన్నారు. లేదంటే ఇప్పటికే దుమ్ము లేచేదన్నారు. తన ఇంటిలోకి గులాభి కండువాలు కప్పుకున్నవారికే అనుమతి వుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మేము మంత్రులుగా ఉండి ఫెయిల్ అయ్యామని ఆత్మపరిశీలన చేసుకుంటున్నామన్నారు. వైఎస్ కంటే కేసీఆర్ ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more