Akhil Gogoi slams govt for ‘misusing’ NIA పది రోజుల్లో బెయిల్.. మంత్రి పదవి.. ఎన్ఐఏపై అఖిల్ గొగోయ్ అరోపణలు

Tirath singh rawat resigns bjp to have third cm in uttarakhand in four months

akhil gogoi, National investigation agency, NIA lures Akhil Gogoi, NIA Minister post, UAPA Act, anti-caa protest, Citizenship Law, Assam Assembly Elections, CAA, UAPA, RSS, BJP, NIA, Assam, Politics

Assam MLA and Raijor Dal president Akhil Gogoi labelling the National Investigation Agency (NIA) as a “mere political tool” of the BJP government at the Centre. The Raijor Dal chief alleged that the NIA had offered him instant bail if he agreed to join the RSS or offered me to join the BJP and become a minister.

పది రోజుల్లో బెయిల్.. మంత్రి పదవి.. ఎన్ఐఏపై అఖిల్ గొగోయ్ అరోపణలు

Posted: 07/03/2021 01:24 PM IST
Tirath singh rawat resigns bjp to have third cm in uttarakhand in four months

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న అభియోగాలపై 19 నెలల క్రితం సిటిజెన్స్ యాక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించి అరెస్టయిన రైజోర్ ధల్ అధినేత అఖిల్ గొగోయ్.. తనను అరెస్టు చేసి జైల్లో పెట్టిన జాతీయ దర్యాప్తు బృందంపై సంచలన అరోపణలు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద అరెస్ట్ అయిన ఆయనపై నమోదైన అభియోగాలకు సరైన సాక్షాలు లేవని న్యాయస్థానం అయనపై అభియోగాలను కొట్టివేసింది. దీంతో జైలు నుంచే విడుదలైన ఆయన కేంద్రంలోని అధికార బీజేపి పార్టీపైనా, ఎన్ఐఏ పైనా అరోపణలు గుప్పించారు.

తనను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు బృందం అధికారులు తనను విచారించే సమయంలో వారు తనపై మోపిన అభియోగాల గురించి కాకుండా కేవలం తనను పార్టీ మారి రాజకీయాలు చేయాలని చెప్పడం దారుణమన్నారు. తాను బీజేపీలోకి కానీ, ఆర్ఎస్ఎస్‌లో కానీ చేరితే పది రోజుల్లోనే బెయిలు వస్తుందని, లేదంటే పదేళ్లపాటు జైలులోనే గడపాల్సి వస్తుందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తనను హెచ్చరించిందని సంచలన ఆరోపణ చేశారు. అందుకు తాను అంగీకరించని చెప్పడంతో మరి కొన్ని రోజుల తరువాత మరో ఆఫర్ తో తనముందుకు వచ్చారని అన్నారు.

ఈ సారి తాను బీజేపిలో చేరితే తనకు మంత్రి పదవి కూడా వస్తుందని ఆఫర్ చేసిందన్నారు. అయితే తాను పార్టీ మారితే తనకు బెయిల్ తో పాటు మంత్రి పదవి కూడా లభించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అయితే, ఎన్ఐఏ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. ఉపా చట్టం కింద తనపై నమోదైన రెండు అభియోగాలను కోర్టు కొట్టివేయడాన్ని చారిత్రాత్మకమైన తీర్పుగా పేర్కొన్న అఖిల్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఐఏను ఓ అస్త్రంగా వాడుకుంటోందన్నారు. సీబీఐ, ఈడీలానే ఎన్ఐఏ కూడా ఓ రాజకీయ సంస్థలా మారిపోయిందని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhil gogoi  UAPA Act  anti-caa protest  Citizenship Law  Assam Assembly Elections  CAA  UAPA  RSS  BJP  NIA  Assam  Politics  

Other Articles