Karnataka man cycles with snake around his neck మెడ చుట్టూ పామును చుట్టుకుని సైకిల్ పై చక్కర్లు

Viral video man cycles with snake around his neck in k taka s belagavi

old man riding on cycle with snake, viral video latest, belagavi man with snake on cycle, Belagavi man on cycle, Karnataka man on cycle with snake, man cycles with snake around neck, old man, snake, wraped around neck, belagavi, karnataka, viral video, video viral

The video of an old man cycling with a snake around his neck is now going viral on social media. The incident is said to have taken place in Hangarge village in Belagavi taluk. In the video, the man with a snake wrapped around his neck can be seen riding the bicycle, waving and talking to passers-by.

ITEMVIDEOS: వైరల్ వీడియో: మెడ చుట్టూ పామును చుట్టుకుని సైకిల్ పై చక్కర్లు

Posted: 07/06/2021 04:47 PM IST
Viral video man cycles with snake around his neck in k taka s belagavi

పాము ఎదురుపడగానే చెమటలు పట్టి వణికిపోవడం మన వంతు అవుతుంది. కానీ దాని భయం కూడా దానికి ఉంటుంది. తనకు ప్రాణాపాయ పరిస్థితిఏర్పడుతుందన్న భయంతోనే అది తన వద్దనున్న కోరలనే ఆయుధంతో ఎదుటి ప్రాణిని బలి తీసుకుంటుంది. అంతేకాని కాటు వేయడం దాని స్వభావం కాదు.. భయం. పామును చూసిన మనుషులు ఎవరైనా. నోటమాట రాక నిశ్చేష్టులైపోతారు అది కూడా భయమే. ఇక పామును ముట్టుకోవాలంటే పైప్రాణాలు పైనే పోతాయి. ఎవరో కొందరు ధైర్యవంతులు మాత్రం సర్పాలతో ఆడుతూ ఔరా అనిపిస్తారు.

పాములకు తమ వద్ద ఉంటే భయం లేదన్న భరోసా కల్పిస్తే అవి ఏమీ అనవని తెలిసిన ఓ పెద్దాయన.. పాముకు పాలు పోసి పెంచుకుంటున్న సామెతను నిజం చేస్తున్నాడు. ఎక్కడి నుంచో తన ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకున్నాడు. దానిని తన మెడకు చుట్టుకుని తాను పరమశివుడి భక్తుడనని, అందుకనే పాము తనను ఏమీ చేయడం లేదని అంటున్నాడు. అంతటితో ఆగకుండా పామును తన మెడలో వేసుకునే.. సైకిలెక్కి ఊరంతా చుట్టివచ్చాడు. పలువురిని పలకరిస్తూ.. కొందరికి నమస్కారాలు చెబుతూ.. రివ్వున సైకిల్ పై వెళ్లసాగాడు.

ఈ పెద్దాయనను చూసేందుకు కొందరు ఆసక్తి చూపారు. మరికోందరు తమ వాహనాలు తీసుకుని ఆయనకు ముందుగా కదులుతూ.. తమ సెల్ ఫోన్ తో ఆ వీడియోను తమ ఫోన్లలో బంధించారు. ఈ సన్నివేశాలు చూపరులందరూ సంభ్రమాశ్చర్యాలతో నోరెళ్లబెట్టారు. కర్ణాటకలో బెళగావి జిల్లా హంగరగా గ్రామంలో ఈ విడ్డూరం చోటుచేసుకుంది. ఓ వృద్ధుని ఇంట్లోకి పాము (జెర్రిపోతు) చొరబడగా ఏమాత్రం చలించకుండా పామును పట్టుకుని మెడకు చుట్టుకున్నాడు. సైకిల్‌ మీద గ్రామంలో సంచరించాడు. కొందరు అతన్ని ఆపి ఆసక్తిగా చూశారు. తరువాత పామును దూరంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : old man  snake  wraped around neck  belagavi  karnataka  viral video  

Other Articles