IT raids on Ramky Group shocks YSRCP వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కార్యాలయాలపై ఐటీ దాడి

It raida ysrcp rajya sabha mp alla ayodha rami reddy s properties in hyderabad

Ramky Infrastructure, ramky enviro engineers, Income Tax Department, enclave gachibowli, alla ayodha rami reddy, Income Tax Raids, IT Raids, Ramky Group, ycp rajyasabha member, ysrcp mp ayodhya rami reddy, Andhra Pradesh, Crime

Sleuths of the income-tax department on Tuesday conducted searches YSR Congress Rajya Sabha MP Alla Ayodha Rami Reddy's properties in Hyderabad. Searches are being conducted at 15 premises, primarily located in CEO Enclave Gachibowli in the city.

వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కార్యాలయాలపై ఐటీ దాడి

Posted: 07/06/2021 05:47 PM IST
It raida ysrcp rajya sabha mp alla ayodha rami reddy s properties in hyderabad

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అయిన రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయోధ్య రామిరెడ్డి ఇళ్లు, కంపెనీలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. ఆయన హైదరాబాదు గచ్చిబౌలిలోని కేంద్ర కార్యాలయంతో పాటు ఆయనకు చెందిన పలు సంస్ధలపై ఇవాళ ఉదయం ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.

ఆదాయ లెక్కల్లో తేడా చూపించడంతో అసలు ఈ గణంకాలు కరెక్టేనా కాదా అన్న నేపథ్యంలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. రాంకీ గ్రూపు అధినేత అయన రామిరెడ్డికి చెందిన హైదరాబాద్ లోని 15 ప్రదేశాల్లో ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మరీముఖ్యంగా సీఈఓ వుంటే గచ్చిబౌలి టవర్ల్ లోనూ అధికారులు దాడులు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గచ్చిబౌలీలోని రాంకీ ప్రధాన కార్యాలయంతో పాటు 15 ప్రదేశాల్లో దాడులు చేసిన అధికారులు.. ఆళ్ల ఆయోద్య రామిరెడ్డి సంస్థలు గత ఏడాది చూపిన నష్టాలు నిజమేనా కాదా అన్న కోణంలో తనిఖీలు చేస్తున్నారని సమాచారం.

ఆదాయపన్ను శాఖలోని విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం అందింది. ఆయనకు చెందిన పలు సంస్థల మధ్య వందల కొద్ది లావాదేవీలు సాగాయని, అయితే ఈ లావాదేవీలు నిజమైనవేనా లేక షెల్ కంపెనీలా అన్న కోణంలో తనిఖీలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన పలు సంస్థలతో ఆయోద్య రామిరెడ్డికి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఏ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరించడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Income Tax Raids  IT Raids  Ramky Group  ycp rajyasabha member  ysrcp mp  ayodhya rami reddy  

Other Articles