కాంగ్రెస్ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూశారు. 87 సంవత్సరాల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత సోమవారం గుండెపోటుకు గురైన ఆయన సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరభద్రసింగ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్ పైకి తరలించారు. అయినా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. దీంతో వెంటిలేటర్ పై చికిత్స పోందుతూనే ఆయన గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు.
అయితే ఆయన అరోగ్యం విషమించడానికి కరోనా వైరస్ మహమ్మారి కూడా ఓ కారణంగా చెబుతున్నారు అయన బంధువులు. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆయన తొలిసారి కరోనా బారినపడ్డారు. దీంతో చండీగఢ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి కోలుకుని అదే నెల 30న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని గంటలకే గుండెపోటు రావడంతో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఏప్రిల్ 12 నుంచి ఆయన ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అసుప్రతిలోనే చికిత్స పోందుతున్నారు. అయితే అనూహ్యంగా ఆయన మరోమారు జూన్ 11న ఆయనకు మరోమారు కరోనా సోకింది. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. అయితే గత సోమవారం ఆయనకు మరోమారు గుండెపోటు రావడం.. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పైకి తరలించినానా ఫలితం లేకుండా పోయింది.
ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి, ఇవాళ తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు, 1960లలో రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరభద్ర సింగ్ 9 సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్కీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అథ్యక్షుడిగానూ పనిచేశారు. వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ గతంలో ఎంపీగా పనిచేశారు. కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
వీరభద్రసింగ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్, ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పాలనపరంగా, చట్టపరంగా అపార అనుభవం గడించిన వ్యక్తి వీరభద్రసింగ్ అని, హిమాచల్ అభివృద్దిలో ఆయన పాత్ర ఎనలేదని ఆయన మృతి విచారకరమని ప్రధాని నరేంద్రమోడీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వీరభద్ర సింగ్ మరణం బాధకరం, ముఖ్యమంత్రిగా, ఎంపీగా దాదాపు 6దశాబ్దాల పాలు ఆయన హిమాచల్ అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించారని, అయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నానని రాష్ట్రపతి సంతాపం వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తాము బలమైన నేతను కోల్పోయామని, ప్రజలు, పార్టీ పట్ల ఆయన నిబద్దత ఎప్పటికీ ఓ ఉదాహరణగా నిలుస్తుందని, ఆయన మృతి బాధాకరమని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more