Kolkata woman gang-raped & robbed at home కొల్ కత్తాలో ఒంటరి యువతిపై సామూహిక అత్యాచారం..

Woman gang raped at kolkata flat robbed of rs 15 lakh cash

kolkata gangrape, woman gangraped at flat in kolkata, kolkata gangrape, woman gangrape, garden reach area, gardern reach police station, kolkata police, gangrape, robbery, kolkata, west bengal, kolkata crime news

A 26-year-old woman was gang-raped in her apartment in Kolkata's Garden Reach area, following which the flat was robbed of Rs 15 lakh in cash, police said.

కొల్ కత్తాలో ఒంటరి యువతిపై దారుణం.. రూ. 15 లక్షలు చోరీ..

Posted: 07/08/2021 11:24 AM IST
Woman gang raped at kolkata flat robbed of rs 15 lakh cash

పశ్చిమ బెంగాల్ రాజధానిలో ఒంటిరి యువతిపై అఘాయిత్యం జరిగింది. 26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలోని ఏ ప్రాంతంలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు ఆపై రూ. 15 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజదాని కోల్ కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ ‌లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్ కత్తాలోని గార్డన్ రీచ్ ప్రాంతంలోని అపార్డుమెంట్లలో యువతి ఒంటరిగా నివసిస్తోందని పక్కగా తెలుసుకున్న దుండగులు మధ్యాహ్నం సమయంలో అమె ఇంట్లోకి ప్రవేశించారు. అమెను కట్టేసి ఆపై అమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో అగకుండా అమె దాచుకున్న రూ. 15 లక్షల రూపాయల డబ్బును కూడా తీసుకుని పరారయ్యారు. కాగా తనపై గుర్తు తెలియని అగంతకులు అత్యాచారం చేసి తన డబ్బును కూడా దోంగతనం చేసి పరారయ్యారని యువతి గార్డన్ రీచ్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా బాధిత యువతిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించగా, ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. కాగా యువతి ఇంట్లోకి అగంతకులు ఎలా ప్రవేశించగలిగారు.. యువతి వారిని ఇంట్లోకి ఎలా రాణించిందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి ముందు యువతిని కట్టేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కోల్‌కతా డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles