Fishermen carry Tamil Nadu minister on shoulders మత్స్యకారులకు ధైర్యం చెప్పడానికి వచ్చిన అమాత్యుడిలా..

Tamil nadu minister won t wet his shoes fishermen carry him from boat to land

Anitha Radhakrishnan, Anitha Radhakrishnan fishermen, fishermen carry Anitha Radhakrishnan, tamil nadu fisheries minister, Tamil Nadu minister Anitha Radhakrishnan, Tamil Nadu minister Anitha Radhakrishnan carried on shoulders, Tamil Nadu minister Anitha Radhakrishnan carried on shoulders watch video, fishermen controversy

Tamil Nadu's Minister for Fisheries-Fishermen Welfare and Animal Husbandry, Anitha Radhakrishnan, was caught on camera being carried by fishermen to save his slippers from getting wet. The video of the incident has gone viral on social media where people are calling out the minister over VIP culture.

ITEMVIDEOS: మత్స్యకారులకు ధైర్యం చెప్పడానికి వచ్చిన అమాత్యుడిలా..

Posted: 07/08/2021 09:18 PM IST
Tamil nadu minister won t wet his shoes fishermen carry him from boat to land

ఇటీవలే ఎన్నికలు ముగిసిన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో.. తానేమి అంతకుముందున్న అమాత్యులకు తీసిపోనని అనుకున్నాడో లేక.. ఇక ఐదేళ్ల వరకు తన కాళ్లకు బురద అంటుకోకూడదనో మొత్తానికి ఓ అమాత్యుడు చేసిన పనితో తనకు తానే తన ప్రతిష్టకు బురదను అంటించుకున్నారు. తమిళనాడులో ఏప్రీల్ నెలలో జరిగిన ఎన్నికలలో గెలిచిన డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ కు స్టాలిన్ ప్రభుత్వం  మత్య్సశాఖ మంత్రిగా చేసింది.జ అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి సముద్ర తీరం కోతకు గురైందని మత్స్యకారులు అందోళనకు గురికావడంతో వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ధైర్యం చెప్పడానికి వచ్చిన మంత్రి అబాసుపాలయ్యాడు.

ఆయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అమాత్యుల వారు మత్య్సకారుల కష్టాలు తన దృష్టికి రాగానే స్పందించి వారి కోసం సముద్రతీరానికి బోటులో వెళ్లారు. కోత‌కు గురైన స‌ముద్ర తీర ప్రాంతాన్ని చూసి, మ‌త్స్య‌కారుల‌కు ధైర్యం చెప్ప‌డానికి పాల‌వేర్కాడుకు వెళ్లిన ఆయన.. అక్క‌డి నీటిలో న‌డ‌వ‌డానికి చిరాకు ప‌డ్డారు. బోటులోంచి కిందకు దిగడానికి వెనకంజ వేశారు. తన ఖరీదైన బూట్లకు బురద అంటుతుందని బోటులోనే ఉండిపోయారు. ఆయన నీటిలోకి దిగడానికి అలోచనలో పడటంతో గ్రహించిన మత్య్సకారులు ఆయనను తమ భుజాలపై ఎక్కించుకుకి తీసుకెళ్లారు,

ఈ వీడియోను స్థానిక పాలిమ‌ర్ న్యూస్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాలికి  బుర‌ద అంట‌కుండా ప‌డ‌వలో ప్ర‌యాణించిన రాధాకృష్ణ‌న్ అనంతరం కూడా దానిలోంచి దిగ‌డానికి వెన‌కాడారు. నీళ్లు ఉన్న చోటే ప‌డ‌వను నిల‌ప‌డంతో అందులోంచి దిగ‌లేదు. ఈ కార‌ణంగా ఆయ‌న‌ను మ‌త్స్య‌కారుడు మోసుకెళ్లాల్సి వ‌చ్చింది. క‌నీసం నీళ్ల‌లో న‌డ‌వ‌డానికి కూడా ఇష్ట‌ప‌డని మంత్రికి ప్ర‌జ‌ల కష్టాలు ఎలా తెలుస్తాయ‌ని నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. ఇక మరికోందరు ఇది విఐపీ కల్చర్ గా మారిందని అంటుండగా, ఎన్నికల వేళ్ల బురద వున్నా, నీరు వున్నా పట్టించుకోకుండా తిరిగే నేతలు.. మంత్రులైతే మాత్రం ప్రజలకు పెద్ద సేవకులం అన్న విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles