మీకు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్బీఐ) లో ఖాతా వుందా..? అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ వార్త మీకోసమే. మీ ఖాతాను చైనాకు చెందిన సైబర్ హ్యాకర్లు దాడి చేసే ప్రమాదం వుంది. దీంతో ఏం జరుగుతుంది అంటారా.? మీ ఖాతాలో వున్న సోమ్ము మొత్తం వారు కాజేసే అవకాశం వుంది. ఈ మేరకు ఎస్బీఐ ఖాతాదారులను ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. ఓటీపీ స్కామ్ ముప్పు పొంచి ఉందని కస్టమర్లను హెచ్చరించారు. కేవైసీ అప్ డేట్ పేరుతో బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేస్తున్నారు. హ్యాకర్లు ఓ వెబ్ సైట్ లింక్ పంపుతారు. కేవైసీ అప్ డేట్ చేయాలని కోరతారు.
అంతేకాదు బ్యాంకు నుంచి రూ.50లక్షలు ఉచిత కానుకలు వస్తాయని ఆశ పెడతారు. వాట్సాప్ మేసేజ్ ద్వారా సందేశాలు పంపుతారు. అలాంటి మేసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న థింక్ ట్యాంక్ సైబర్ పీస్ ఫౌండేషన్ రీసెర్చ్ వింగ్, ఆటోబోట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్.. ఎస్బీఐ పేరుతో కొంతమంది స్మార్ట్ ఫోన్ యూజర్లు మోసపోయిన ఘటనల గురించి తెలుసుకున్నారు. డొమైన్ పేర్లన్నీ చైనా పేరుతో ఉన్నట్టు వారు గుర్తించారు. ఎస్బీఐ అఫిషియల్ ఆన్ లైన్ పేజీని తలపించే వెబ్ సైట్ నుంచి కేవైసీ వెరిఫికేషన్ పేరుతో ఓ వ్యక్తికి మేసేజ్ వచ్చింది.
కంటిన్యూ టు లాగిన్ పై క్లిక్ చేసి కేవైసీ నింపాలని అందులో ఉంది. అక్కడ కాన్ఫిడెన్షియల్ సమాచారం అయిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ అడిగింది. వాటిని ఎంటర్ చేసి ఆన్ లైన్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అవ్వాలని ఉంది. ఆ తర్వాత యూజర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ యూజర్ తన పేరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఆ వివరాలు ఇచ్చాక యూజర్ ను ఓటీపీ పేజ్ కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశామో ఇక అంతే..మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. ఇలా హ్యాకర్లు చీట్ చేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. ఎస్బీఐ డూప్లికేట్ పేజ్ డిజైన్ చేసి అందులో కేవైసీ అప్ డేట్, ఓటీపీ పేరుతో మేసేజ్ లు పంపుతారని అన్నారు, బ్యాంకు అధికారులను సంప్రదించాలని, క్రాస్ చెక్ చేసుకోవడం సముచితం అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more