Student Union Intercepts KTR's convoy కేటీఆర్ కు విద్యార్థుల సెగ.. కాన్వాయ్ అడ్డగింపు

Telangana abvp activists intercepts ktr s convoy in narayanpet

KTR convoy intercepted by students, Students intercept KTR convoy, Minister KT Rama Rao, Akhil Bharatiya Vidyarthi Parishad, Minister Srinivas Goud, MLA Rajender Reddy, ABVP, District government hospital, Narayanpet, Narayanpet news, Narayanpet latest news, Telangana, Politics

Minister KT Rama Rao convoy intercepted in Narayanpet The activists of Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) intercepted minister KT Rama Rao's convoy here at Narayanpet, raising slogans against the TRS government.

ITEMVIDEOS: కేటీఆర్ కు విద్యార్థుల సెగ.. నారాయణ పేట్ లో కాన్వాయ్ అడ్డగింపు

Posted: 07/10/2021 02:49 PM IST
Telangana abvp activists intercepts ktr s convoy in narayanpet

 తెలంగాణ‌ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విద్యార్థుల నిరసన సెగ తాకింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు ప్ర‌య‌త్నించారు. అయితే, ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో టీఆర్ఎస్ స‌ర్కారు నిర్ల‌క్ష్య ధోర‌ణిని విడనాడాల‌ని వారు నినాదాలు చేశారు.  

ఉద్యోగాల కోసం ఉధ్యమం అంటూ అధికారంలోకి రాకముందు దాదాపు 12 ఏళ్లు మభ్యపెట్టిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తున్నా ఉద్యోగాల ప్రస్తావనను తీసుకురాకపోవడంతో విద్యార్థులు నిరసించారు. ఇంటికో ఉధ్యోగం ఇస్తామని చెప్పిన ఉద్యమ నేత కేసీఆర్.. ఫామ్ హౌజ్ టు ప్రగతి భవన్ కే పరిమితం అయ్యాడని వారు విమర్శించారు. వందల మంది వుండే హాస్టళ్లలో సన్నబియ్యం అన్నం పెడుతున్నామని ప్రచారం చేసుకుని గత ఎన్నికల్లో గెలిచిన ఆయన.. అన్నం పెట్టిన చేతితోనే నిరుద్యోగుల ఉసురు తీస్తున్నాడని విమర్శించారు.

విద్యార్థులు, నిరుద్యోగులు అన్నం కోసం కాదని ఉధ్యోగాల కోసం ఉధ్యమిస్తున్నారని ఎప్పుడు అర్థం చేసుకుంటారోనని నిరసనకారులు ఎద్దేవా చేశారు. విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకుంటున్న తరుణంలో యాభై వేల ఉధ్యోగాలకు సీఎం కేసీఆర్ అంగీకరించారని, త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ వస్తే లక్షల ఉధ్యోగాలు వస్తాయని ఉద్యమం సమయంలో విద్యార్థులను ఉసిగోల్పిన కేసీఆర్.. ఇప్పుడు ఉధ్యోగాలను వేల సంఖ్యకు మాత్రమే పరిమితం చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల నిరసనలను కప్పిపుచ్చేందుకు వినియోగించే పథకాలతో రాజకీయ అలోచనలే కానీ తెలంగాణ ప్రజల బతుకులు గురించి ఆలోచన లేదని దుయ్యబట్టారు.

నగరంలో ఎక్కడ ప్రజలు అందోళనలను కనిపించకుండా నగర శివారు ప్రాంతాలకు నిరసనలను పరిమితం చేసి ప్రభుత్వ వ్యతిరేకతను కనిపించకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు నిరసిస్తూనే వున్నారు. అయితే అందరూ చేరి ఒక్క చోట ఉద్యమించే అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వంపై వున్న వ్యతిరేకత గత ఏడేళ్లుగా కనిపించ చేయడంలో విజయవంతమైన ప్రభుత్వానికి విద్యార్థుల నిరసన సెగతో నారాయణ పేట నుంచి నిరసనలు ఊపందుకుంటాయా.? అన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.

కాగా, త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నారాయణపేట ప్రభుత్వ ఆసుప‌త్రిలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన చిన్నారుల వార్డును ప్రారంభించారు. అలాగే, వెజ్, నాన్వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. అమరవీరుల స్మారక ఉద్యానవనంతో పాటు సింగారం క్రాస్ రోడ్డులో చేనేత కేంద్రం ప‌నుల‌ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KT RamaRao  KTR  Convoy  Students Union  Narayanpet  ABVP  Srinivas Goud  Telangana  Politics  

Other Articles