పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. దుండగులు ఆమెను అతి దారుణంగా గొంతుకోసి హత్యచేసి… నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు. పాకిస్తాన్ ప్రఖ్యాత మోడల్ నయాబ్ నదీమ్(29) ఆదివారం అనుమానాస్పద రీతిలో హత్య చేయబడింది. లాహోర్ లోని ఆమె ఇంట్లోనే ఈదారుణం చోటు చేసుకుంది. దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి దారుణంగా హత్యచేశారు. నయాబ్ సవతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నయాబ్ లాహోర్ లోని డిఫెన్స్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు.
ఆమె సవతి సోదరుడు నసీర్ ఇచ్చిన సమాచారం మేరకు … శనివారం అర్ధరాత్రి మేమిద్దరం ఐస్క్రీం తినటానికి వెళ్లాం… ఆతర్వాత తనను ఆమె ఇంటి వద్ద దింపి, నేను ఇంటికి వచ్చిపడుకున్నాను. నేను నిద్రపోయిన తర్వాత నాకు నయాబ్ కాల్ చేసింది. నిద్రలో ఉన్న నేను ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. ఉదయం నిద్రలేచి తిరిగి ఆమెకు కాల్ చేశాను. కానీ ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో తనను చూడటానికి ఇంటికి వచ్చాను. అక్కడ నాకు భయానక దృశ్యం కనిపించిందని చెప్పుకొచ్చాడు.
గొంతు దగ్గర గాయంతో… రక్తపు మడుగులో.. నగ్నంగా పడి ఉన్న నయాబ్ శరీరం చూశానని… ఆ దృశ్యం చూసి షాక్ కు గురయ్యానని చెప్పాడు. అనంతరం తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశానని నసీర్ తెలిపాడు. నయాబ్ ఇంట్లో దొంగతనం జరిగిన లక్షణాలు కూడా లేవని… ఆమె ఇంటి బాత్రూం కిటీకి పగిలిపోయి ఉందని దుండగులు దాని ద్వారా లోపలకు వచ్చి హత్యచేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు అతను వివరించాడు.దుండగులు ఆమెను హత్యచేసి మృతదేహాన్ని నగ్నంగా టీవీ రూం లోపడేసి వెళ్లినట్లు నసీర్ వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more