Anandaiah's Ayurveda medicine to be delivered online ఆనందయ్య ఆయుర్వేద ఔషధం పేరిట నకిలీ మందు..!

Anandaiah s ayurveda medicine to be delivered online to covid patients

Anandaiah, duplicate medicine, ayurvedic corona medicine, Krishnapatnam medicine, nellore corona medicine, herbal medicine, anandaiah medicine, COVID 19, Coronavirus, Pandemic, Lockdown, corona vaccine, vaccination, vaccines, oxygen, herbal medicine, eye drops, B. Anandaiah, Andhra Pradesh, politics

The SPS Nellore district Ayurvedic practitioner B Anandaiah requests Andhra Pradesh Government to take necessary steps to irradicate the duplicate medicine which is being on his name. The Ayurvedic doctor says he is not responsible if that medicine gives adverse impact.

అలర్ట్: ఆనందయ్య ఆయుర్వేద ఔషధం పేరిట నకిలీ మందు..!

Posted: 07/14/2021 04:11 PM IST
Anandaiah s ayurveda medicine to be delivered online to covid patients

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గుర్తున్నాడా.? ఆయన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలకు ఆయన తన ఆయుర్వేద ఔషదాన్ని తయారు చేసి కరోనా బాధితులతో పాటు కరోనా రాకుండా నివారణ మందును కూడా తయారు చేసి ఉచితంగా పంచుకున్నారు. దీంతో ఆయన డబ్బులు లేని పేదలు, సామాన్య ప్రజలతో పాటు డబ్బులున్న పెద్దల వరకు.. రాజకీయ నాయకుల నుంచి వివిఐపీల వరకు అందరి పాలిట అపద్భాందవుడిగా మారారు కృష్ణపట్నం ఆనందయ్య. ఎందరో అధికారగణం, పాలక పక్షం, ప్రతిపక్ష నేతలు ఆయన మందును తయారు చేయించుకుని తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఇప్పటికీ ఎంతోమంది తీసుకెళ్తున్నారు.

ఆయుష్ సంస్థ పరిశోధనల అనంతరం ఆనందయ్య ఔషద పంఫిణీకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర హైకోర్టు కూడా అనుమతి మంజూరు చేసింది. దీంతో ఆనందయ్య మందును ఆన్ లైన్ ద్వారా దేశంలోని ప్రజలకు అందజేస్తున్నారు. కాగా తాజాగా ఆనందయ్య మందుపేరుతో నకిలీ మందుకు కూడా తయారవుతున్నాయని స్వయంగా ఆయన అందోళన వ్యక్తం చేశారు. తన పేరుతో కొందరు నకిలీ మందు తయారు చేస్తున్నారని, వాటిని వాడే విషయంలో బాధితులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. దీనిని వాడిన రోగులకు కొత్త సమస్యలు ఉత్పన్నమైన పక్షంలో అందుకు తాను బాధ్యుడ్ని కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు.

కాగా, తన పేరుతో నకిలీ కరోనా నివారణ మందును తయారు చేస్తున్న వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాను త‌యారు చేసిన క‌రోనా మందు అన్ని ప్రాంతాలకూ చేరింద‌ని ఆయ‌న చెప్పారు. దాని పంపిణీకి సహకరించిన వారికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని అన్నారు. అయితే నకిలీ ఔషదానికి చెక్ పెట్టేందుకు, దేశవ్యాప్తంగా వస్తున్న ఆర్డర్లకు సకాలంలో సప్లై చేసేందుకు ఆనందయ్య కొత్త పద్ధతి అవలంబిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయుర్వేదం మందుని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో చేతితోనే ప్యాకింగ్ చేసేవారు. కానీ తొలిసారి దీనికోసం రేగుపండు గుజ్జుని తయారుచేసి, ప్యాక్ చేసే ప్లాంట్ ని ఆయన కొనుగోలు చేశారని తెలుస్తోంది.

నెల్లూరు పట్టణ శివారులో ఉన్న ఈ ప్లాంట్ లో మందు తయారీ చేపడుతున్నారట. ఇకపై ఈ ప్లాంట్ లోనే ఆనందయ్య హాల్ మార్క్ లోగో ఉన్న కవర్లలో ఆయుర్వేదం మందు ప్యాక్ చేస్తారట. ఇదే అధికారికమైన ఆనందయ్య మందు అంటూ ప్రచారం చేపట్టబోతున్నారు. ఆనందయ్య ఇచ్చే అన్ని ఆయుర్వేద మందులకి సమ్మతి తెలియజేసిన ఏపీ ప్రభుత్వం, చుక్కల మందు విషయంలో మాత్రం రిస్క్ తీసుకోదలచుకోలేదు. కోర్టు పదే పదే అదే విషయాన్ని అడిగినా, కుదరదని చెప్పేసింది. నిపుణుల పరిశీలనలో చుక్కల మందుతో సైడ్ ఎఫెక్స్ట్ వస్తాయని, దాని పంపిణీకి అధికారికంగా ఎలాంటి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో ప్రస్తుతానికి ఆనందయ్య ఇస్తున్న కరోనా ప్రివెంటివ్ మెడిసిన్ మాత్రమే మార్కెట్లో బాగా పాపులర్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles